యాంకర్ రష్మీ నయా హాట్ షో.. కొంగులేపుతున్న పోజులతో సోకుల విందు!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం తమకు సంబంధించిన సినీ కెరీర్, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే సినిమా అప్డేట్స్ ను ఇస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే బుల్లితెర యాంకర్లు సైతం అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ అటెన్షన్ డ్రా చేస్తున్నారు. మూగ జీవాలపై చాలా సాఫ్ట్ గా స్పందించే బుల్లితెర ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంటుంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది.

మోడల్ గా సత్తా చాటి..

మోడల్ గా సత్తా చాటి..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు రష్మీ గౌతమ్. ఎందుకంటే బుల్లితెరపై అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది.

వెనుతిరిగి చూడకుండా..

వెనుతిరిగి చూడకుండా..

తెలుగు చిత్ర పరిశ్రమలో అరకొర అవకాశాలతో సాగిపోతోన్న రష్మీ గౌతమ్ కి బుల్లితెరపై కామెడీ షోగా పేరు పొందిన జబర్ధస్త్ కు యాంకర్‌గా అవకాశం వచ్చింది. అంతే.. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. యాంకర్ గా రాణించడానికంటే ముందే సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసింది.

సూపర్ క్రేజ్ తెచ్చుకున్న..

సూపర్ క్రేజ్ తెచ్చుకున్న..

స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'గుంటూరు టాకీస్' మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో డీజే టిల్లుగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించాడు. అలాగే మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత రష్మీ గౌతమ్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో చాలా స్లోగానే సినిమాలు చేస్తూ వస్తోంది.

ఆచితూచి అడుగులు వేస్తూ..

ఆచితూచి అడుగులు వేస్తూ..

సినిమాలను ఆచితూచి అడుగులేస్తూ ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది యాంకర్ రష్మీ గౌతమ్. ఇందులో భాగంగానే ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన కెరీర్‌ మీదనే ఫోకస్ పెడుతోంది.

అనసూయ తప్పుకోవడంతో..

అనసూయ తప్పుకోవడంతో..

సినిమాలకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపైనే ఆకట్టుకునేందుకు సిద్ధమైంది ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. అయితే సుడిగాలి సుధీర్, అనసూయ తప్పుకోవడంతో 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలను కూడా హోస్ట్ చేస్తూ అలరించింది ఈ బ్యూటిఫుల్ యాంకర్. జబర్దస్త్ షోకి సౌమ్య రావు యాంకర్ గా రావడంతో ఇప్పుడు 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలో మాత్రమే హోస్టింగ్ చేస్తోంది. అలాగే, చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.

ఎన్నో అంశాలపై స్పందిస్తూ..

ఎన్నో అంశాలపై స్పందిస్తూ..

వరుస పెట్టి టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న స్టన్నింగ్ బ్యూటి యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే ఎన్నో అంశాలపై స్పందిస్తూ వివాదాల్లోనూ చిక్కుకోవడమే కాకుండా హాట్ ఫొటోలు పెడుతుంటుంది.

కొంగు లేపి వెనక్కి తిరిగి చూస్తూ..

సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా హాట్ పిక్స్ కొన్ని షేర్ చేసింది. ఇందులో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గల చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి పోజులిచ్చింది. వివిధ భంగిమల్లో నిల్చుని పోజులిస్తూ మరి తన సోకుల విందు చేసింది. ముఖ్యంగా ఇందులో ఆమె బ్యాక్ అందాలను ఆరబోసింది. కొంగు లేపి పట్టుకుని వెనక్కి తిరిగి కొంటెగా చూస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X