Rashmi Gautam: చనిపోయిన వాళ్లతో మాట్లాడించిన యాంకర్ రష్మి.. ఆ టెక్నాలజీ వాడుతూ..!
ఎవరైనా సరే ఒకసారి చనిపోయారంటే మళ్లీ మనం వాళ్లతో మాట్లాడలేం. అంత్యక్రియలు నిర్వహించాకా మల్లీ వాళ్లను మనం చూడను కూడా చూడలేం. వాళ్లు ఫొటోలు, వీడియోలు, జ్ఞాపకాలతోనే జీవితం గడిపేస్తుంటాం. కానీ తొలిసారి చనిపోయిన వాళ్లతో మాట్లాడించే ప్రయత్నం చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ షో. ముఖ్యంగా ఈ షోలో యాంకర్ రష్మి.. కమెడియన్ల కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వారి మాటలను వినిపించింది. ఇది చూసి షాక్ అయిన కెమడియన్లు.. కంటతడి పెట్టుకున్నారు. వారిని ఎంతగా మిస్ అవుతున్నారో కూడా చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్.. షోల తర్వాత అంత పాపులారిటీ సంపాధించుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ షోయే. అదిరిపోయే కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు ఈ షో ద్వారా కమెడియన్లు. అలాగే పలు ఎపిసోడ్ లో ఎమోషన్స్ ను కూడా పండిస్తూ.. టీఆర్పీని పెంచుకుంటున్నారు. కమెడియన్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా పండుగలు, పబ్బాలు అప్పుడు తీసుకు వస్తూ పంచులు వేయిస్తున్నారు. అయితే ఈసారి ఉగాది పండుగ సందర్భంగా మరో సర్ ప్రైజింగ్ ఎపిసోడ్ ను తీసుకు రాబోతున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన అదిరిపోయే ప్రోమో విడుదల చేశారు. ఇందులో పలువురు కమెడియన్ల.. కుటుంబ సభ్యులు ఎప్పుడో చనిపోగా.. వారితో మాట్లాడించారు. యాంకర్ రష్మి గౌతమ్ తొలిసారి చనిపోయిన వాళ్లతో మాట్లాడించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదెలా సాధ్యం అయిందంకూ ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు తల్లి లేదన్న విషయం కూడా విధితమే.
అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో.. చనిపోయిన పటాస్ ప్రవీణ్ తల్లి.. మళ్లీ వచ్చి మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆమె ఫొటోను.. ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోగా మలిచి ఆమె మాట్లాడేలా ప్లాన్ చేశారు. వీడియో ప్లే కాగానే.. బాబు ఎలా ఉన్నావంటూ ప్రవీణ్ తల్లి అడగ్గా.. చాలా ఎమోషనల్ అయ్యాడు. తల్లి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ ఉదయం, రాత్రి ఆమెను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయానని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ తర్వాత కమెడియన్ డ్యాన్సర్ పండు వాళ్ల తల్లితో కూడా మాట్లాడించగా.. ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. స్టేజీ మీదే తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే తాగుబోతు రమేష్ తల్లి, తండ్రుల ఇద్దరి మాటలు వినిపించేలా చేశారు. ఇలా ఈ ముగ్గురుకీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వగా.. తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











