యాంకర్ రష్మీకి బాగా పొగరు.. ఎయిర్ పోర్ట్‌లో ఏం చేసిందంటే!
గ్లామరస్ యాంకర్ గా జబర్దస్త్ లాంటి టివి షోలతో రష్మీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుంటూరు టాకీస్ చిత్రంతో బోల్డ్ రోల్స్ కు జై కొట్టి యువత హృదయాల్లో కలవరం రేపింది. రష్మీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. తన గురించి వచ్చే కామెంట్స్ ని రష్మీ బాగా గమనిస్తుందేమో. ఎవరైనా నెటిజన్ తనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. రష్మీకి బాగా పొగరు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో రష్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

రష్మీకి పొగరెక్కువ
ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా రష్మిపై విమర్శలు గుప్పించాడు. ఆమెకు పొగరెక్కువ. నిన్న రష్మిని విమానాశ్రయంలో కలిశాను. రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించింది. ఇలాంటి ప్రవర్తన ఆమె కెరీర్ కు మంచిది కాదు. ఆమె సౌమ్యంగా, మంచిగా మెలగడం నేర్చుకోవాలి అంటూ నెటిజన్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. దీనిపై రష్మీ కూడా కౌంటర్ ఇచ్చింది.
24గంటలు నిద్ర లేదు
నాకు గత 24 గంటలుగా నిద్ర లేదు. మూడు విమానాలు మారి ప్రయాణం చేశా. బహుశా అందుకే దురుసుగా ప్రవర్తించి ఉంటా అని తెలిపింది. నా కెరీర్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎపుడైనా బాగానే ఉంటా. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది.

తరచుగా వివాదాల్లో
రష్మీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటుంది. కానీ ఎలాంటి వివాదాలనైనా రష్మీ అంతగా పట్టించుకోదు. ఇదిలా ఉండగా రష్మీ గుంటూరు టాకీస్, అంతకు మించి చిత్రాలతో గ్లామర్ రోల్స్ కు తెరలేపింది. ఇటీవల కూడా గ్లామర్ రోల్స్ కు తాను సిద్దమే అంటూ సిగ్నల్స్ ఇచ్చింది. రష్మీ తన గ్లామర్ తో యాంకర్ గా పాపులర్ అయింది.

రూమర్స్
ఇక జబర్దస్ కమెడియన్ సుధీర్, రష్మీ మధ్య చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో రష్మీ ఈ వార్తలని ఖండించింది. తామిద్దరం స్నేహితులం మాత్రమే అని రష్మీ తెలిపింది. తాము ఏం చేసినా అది తమ వృత్తి, జబర్దస్త్ షోలో భాగమే అని రష్మీ తెలిపింది. ఆన్ స్క్రీన్ పై జరిగేది నిజం కాదు. వాటి ఆధారంగా పుకార్లు సృష్టించకూడదు అని రష్మీ తెలిపింది.


Click it and Unblock the Notifications











