సహజీవనం చేయొచ్చు, నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తాడు.... చివరకు సుధీర్‌కే రష్మి దక్కేనా?
తెలుగు యాంకర్స్ రష్మి, సుధీర్... టీవీ రంగంలో ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జబర్దస్త్ షోలో సైతం పలువురు కమెడియన్లు వీరికి లింక్ పెడుతూ పంచులు పేలుస్తుండటంతో ప్రేక్షకుల్లో సైతం వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది.
అయితే గత ఇంటర్వ్యూల్లో రష్మి, సుధీర్ స్పందిస్తూ... తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, వృత్తి పరంగా క్లోజ్‌గా ఉంటాం తప్ప, తమ మధ్య అలాంటిదేమీ లేదని వెల్లడించారు. అయితే వారు చెప్పిన మాటలు చాలా మందికి నమ్మబుద్దికావడం లేదు. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లైవ్ చాట్ చేసిన రష్మికి సుధీర్ గురించి ప్రశ్నలు చాలా ఎదురయ్యాయి.

నన్ను మహారాణిలా చూసుకుంటాడు: రష్మి
సుడిగాలి సుధీర్‌ను ఎందుకు అంతలా అసహ్యించుకంటున్నారు? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘అలాంటి వారిని నేనుప్పుడూ అసహించుకోను. ఎందుకంటే వారు నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తారు' అని తెలిపారు.

పెళ్లి, వయసు.... నచ్చదు
ఎలాంటి ప్రశ్నలు మీకు చికాకు తెప్పిస్తాయి? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘పెళ్లికి సంబంధించిన, ఏజ్ రిలేటెడ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు నచ్చదు' అన్నారు.

చివరకు సుధీర్‌కే దక్కుతుందేమో?
రష్మి ఎవరి కోసం వెయిట్ చేస్తుందో... చివరకు సుధీర్‌కే దక్కుతుందేమో? అనే అభిమాని కామెంటుకు ‘‘చాలా రోజుల క్రితమే నా వెయింటింగ్ ముగిసింది. నా ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ గానే ఉంచాలనుకుంటున్నాను'' అని తెలిపారు.

సుధీర్, ప్రధీప్.... వారిని వేరుగానే, అలాంటిది జరుగదు
సుధీర్, ప్రదీప్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు ‘నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్... వేర్వేరుగా ఉంటాయి. అందులో ఉండే వ్యక్తులు ఇందులోకి, ఇందులో ఉండే వ్యక్తులు అందులోకి రావడం జరుగదు' అని రష్మి అన్నారు.

సహజీవనం ఆప్షన్ కూడా ఉంది
లవ్ మ్యారేజ్.... అరేంజ్డ్ మ్యారేజ్ వీటిలో దేన్ని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... ‘సహజీవనం' అనే మరో ఆప్షన్ కూడా ఉంది అంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.

నా కోరిక కూడా అదే, కానీ...
మీరు ఆల్రెడీ లైవ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారా? లేక భవిష్యత్తులో ఎవరితోనైనా సహజీవనం చేస్తారా? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... నా కోరిక కూడా అదే. కానీ ప్రస్తుతం నా జీవితం స్టేబుల్‌గా లేదు. నేను నా సూట్ కేసు నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే ఆ సూట్‌కేసులో ఇద్దరు వ్యక్తులు ఇమడటం లేదు అని రష్మి తెలిపారు.


Click it and Unblock the Notifications











