మొదటిసారిగా అలా.. గేర్ మార్చేసినట్టుంది.. యాంకర్ రష్మిలోనూ మార్పు?

ఒక్కొసారి ఇండస్ట్రీలో మనం గీసుకున్న గీతలు దాటాల్సి వస్తుంటి. గిరి గీసుకుని కూర్చుంటే పనులు కావు. మరీ ముఖ్యంగా బుల్లితెరపై కొందరు నటీమణులు అదే చానెల్‌లో కనిపిస్తూ అక్కడే ఉండిపోతుంటారు. పక్క చానెల్ వైపు చూడరు.. అవకాశాల కోసం వెంపర్లాడరు. కానీ కొందరు మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా సందడి చేస్తుంటారు. సుమ, అనసూయ వంటి వారు ఈ కోవకే చెందుతారు. కానీ రష్మీ మాత్రం ఈటీవీలో తప్పా మరెక్కడా కనిపించదు.

 మొత్తం అక్కడే..

మొత్తం అక్కడే..

యాంకర్ రష్మీ మొత్తంగా ఈటీవీలోనే కనిపిస్తుంటుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలంటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా పక్క చానెళ్లకు వెళ్లదు. పక్క చూపులు చూడదు. స్పెషల్ ఈవెంట్లు చేసినా కూడా అదే చానెల్‌లో చేస్తుంటుంది.

 కొందరు అలా..

కొందరు అలా..

యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖి వంటి వారు మాత్రం ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్తుంటారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చానెల్స్‌ను కవర్ చేస్తుంటారు. స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ కనిపిస్తుంటారు. కానీ తాజాగా రష్మీ కూడా రూట్ మార్చేసినట్టుంది.

 స్టార్ మాలో కొత్త ప్రోగ్రాం..

స్టార్ మాలో కొత్త ప్రోగ్రాం..

స్టార్ మాలో ఈ మధ్య కొత్త షోలను ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరిలో మొదటి రెండు వారాలు బిగ్ బాస్ ఉత్సవం అంటూ సందడి చేశారు. ఈ ఆదివారం నాడు 100 పర్సెంట్ లవ్ అంటూ ఆరుగురు రియల్ జంటలు.. ఆరుగురు రీల్ జంటలు అంటూ రచ్చచేసేందుకు రాబోతోన్నారు.

రీల్ జంంటలు అలా..

రీల్ జంంటలు అలా..

బుల్లితెరపై జంటల్లా క్రేజ్ తెచ్చుకున్న గోరింటాకు, మనసిచ్చి చూడు సీరియల్ జంటలు, దీప్తి సునయన షణ్ముఖ్, అరియానా అవినాష్ వంటి వారు వచ్చేశారు. వీరితో పాటు రష్మీ సుధీర్ కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే రష్మీపై ఓ ప్రోమోను విడుదల చేశారు.

 అదిరిపోయే డ్యాన్స్..

అదిరిపోయే డ్యాన్స్..

రష్మీ డ్యాన్స్ వేస్తే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ రష్మీ తన వయ్యారాలను ఊపేసింది. ఇలా మొదటిసారిగా వేరే చానెల్‌లో రష్మీ కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X