For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్‌కు నిజంగానే ముద్దు పెట్టిన రష్మీ: తొలిసారి ఇలా రెచ్చిపోయిన యాంకర్.. ఆ విషయం మరించిందా!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇవ్వగా.. అందులో కొందరు మాత్రమే విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అందులోనూ మరికొందరైతే ఒంటరిగా కాకుండా జంటగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కపుల్ రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ దాదాపు ఐదారేళ్లుగా జంటగా సందడి చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ రొమాన్స్ కూడా పండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రష్మీ గౌతమ్ అందరి ముందే సుడిగాలి సుధీర్‌కు ముద్దు పెట్టేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
  ఆ షో ద్వారా కలిసిన జబర్ధస్త్ జంట

  ఆ షో ద్వారా కలిసిన జబర్ధస్త్ జంట

  మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆరంభంలోనే అదరగొట్టేసిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక, సినిమా నటిగా కెరీర్‌ను మొదలెట్టింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా మారి సత్తా చాటింది. ఈ షోలోనే వీళ్లిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు.

  అప్పట్నుంచి మొదలైన వ్యవహారం

  అప్పట్నుంచి మొదలైన వ్యవహారం

  యాంకర్‌గా రష్మీ గౌతమ్.. కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ జబర్ధస్త్‌ షోలో తమదైన శైలి టాలెంట్‌తో దూసుకుపోతున్నారు. ఆరంభం నుంచే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అప్పట్లోనే సుధీర్.. రష్మీని ప్రేమిస్తున్నట్లు తరచూ కామెంట్లు చేసేవాడు. అంతేకాదు, అతడికి ఈ యాంకరమ్మ కూడా బాగానే కోపరేట్ చేసేది. దీంతో ఈ టాక్ మొదలైంది.

   ఇద్దరూ చెప్పారు... తగ్గడం లేదుగా

  ఇద్దరూ చెప్పారు... తగ్గడం లేదుగా

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ గురించి రోజు రోజుకూ వార్తలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి గురించి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో వీళ్లకు యూట్యూబ్ జోడీగా పేరొచ్చింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ తమ గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ వార్తలకు పుల్‌స్టాప్ మాత్రం అస్సలు పడడం లేదు.

  వాళ్లు చెప్పింది... వీళ్లు చేస్తున్నారు

  వాళ్లు చెప్పింది... వీళ్లు చేస్తున్నారు

  తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు విడివిడిగా కంటే జంటగానే ఎక్కువగా పేరొచ్చింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ ఏదోలా రొమాన్స్ చేస్తున్నారు. వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం షో నిర్వహకులు తరచూ వీళ్లతో డ్యాన్సులో, పాటలో, రొమాంటిక్ స్కిట్‌లో చేస్తున్నారు. తద్వారా ఆయా షోలకు, ఈవెంట్లకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

  అందులో కూడా రచ్చ చేస్తున్న జోడీ

  అందులో కూడా రచ్చ చేస్తున్న జోడీ

  జబర్ధస్త్‌లో చాలా కాలంగా సందడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ సినిమాల్లోనూ సోలోగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక, అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ' షోలోనూ ఈ జోడీ తెగ హల్‌చల్ చేస్తోంది. మెంటర్లుగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు మజాను పంచుతూ ముందుకు సాగుతున్నారు.

  తొలిసారి ఇలా రెచ్చిపోయిన యాంకర్

  సుడిగాలి సుధీర్ గురించి ఎన్ని సార్లు అడిగినా.. రష్మీ గౌతమ్ స్పందన ఒకేలా ఉంటోంది. అతడితో అందరూ అనుకునేలా రిలేషన్ లేదని చెబుతోంది. అయినప్పటికీ షోల కోసం అతడితో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ.. సుధీర్‌కు ముద్దు పెట్టింది.

  సుధీర్‌కు నిజంగానే ముద్దు పెట్టిన రష్మీ

  సుధీర్‌కు నిజంగానే ముద్దు పెట్టిన రష్మీ


  వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఢీ 13'కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు పుచుక్ మని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసింది. అంతేకాదు, రొమాంటిక్‌గా సైగలు చేస్తూ అతడిని బాగా రెచ్చగొట్టింది. అందుకు అనుగుణంగానే సుధీర్ నుంచి కూడా స్పందన వచ్చింది. తొలిసారి రష్మీ ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Gave Kiss to Sudigali Sudheer in DHEE 13 - Kings vs Queens. This Promo Video Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X