మగాళ్ల డ్రెస్ నచ్చట్లేదు, అవన్నీ కనిపిస్తున్నాయి..నా లిస్ట్ ఇదే, రష్మీ హాట్ కామెంట్స్!

Recommended Video

Anchor Rashmi Sensational Comments On Mens Dressing Style | Filmibeat Telugu

యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ గా మారిపోతోంది. ట్రోలింగ్ చేసే నెటిజన్లకు అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా, బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ పలు విషయాల్లో పురుషాధిక్యతని ప్రశ్నిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మహిళల డ్రెస్ గురించి పలువురు ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా రష్మీ ఓ నెటిజన్ కు సమాధానం ఇస్తూ మగవాళ్ల దుస్తుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్

హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్

గాన గంధర్వుడిగా పేరు గాంచిన ఎస్ పి బాలసుబ్రమణ్యం ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్లు దర్శకులు, నిర్మాతలని ఆకర్షించడానికి ఎక్స్‌పోజింగ్ చేస్తూ సభలకు హాజరవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కొందరు ప్రముఖులు కూడా మహిళల దుస్తులపై అభ్యంతరాలు తెలుపుతుండడంతో ఏ చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

నాగబాబు ఫైర్

నాగబాబు ఫైర్

మహిళల దుస్తులపై వస్తున్న కామెంట్స్ పై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మహిళలు ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో నిర్ణయించడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. మహిళలకు, హీరోయిన్లకు నాగబాబు మద్దత్తు తెలపడంతో రష్మీ, అనసూయ లాంటి సెలెబ్రిటీలు నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నాగబాబు వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రచ్చ చేస్తున్న రష్మీ

రచ్చ చేస్తున్న రష్మీ

మహిళల దుస్తుల గురించి తనని ప్రశ్నిస్తున్న ప్రతి నెటిజన్ కు యాంకర్ రష్మీ ధీటైన సమాధానం ఇస్తోంది. పలు సందర్భంలో రష్మీ మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి రష్మీ ఘాటుగా కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ మాట్లాడుతూ పురుషుల దుస్తుల్లో మీకేమైనా ఇబ్బంది ఉందా అని ప్రశ్నించాడు. దీనికి రష్మీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

అవన్నీ కనిపిస్తున్నాయి

రష్మీ అతడికి సమాధానం ఇస్తూ.. మగవాళ్ళు షార్ట్స్ వేసుకోవడం నాకు నచ్చడం లేదు. వాళ్ళ కాళ్లకు ఉండే వెంట్రులకు అసభ్యంగా ఉన్నాయి. కొంత మంది కట్ బనియన్స్ వేసుకుని తిరుగుతున్నారు. భుజాలు, కండలు చూపిస్తున్నారు. కొంత మంది షర్ట్ లేకుండా తిరుగుతూ చెస్ట్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తున్నారు. ఇవి కొన్ని మాత్రమే.. మగాళ్ల దుస్తుల విషయంలో నాకు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటూ రష్మీ బదులిచ్చింది.

 మహిళలు ప్రశ్నించారా

మహిళలు ప్రశ్నించారా

రష్మీ ఇచ్చిన సమాధానం కొన్ని రోజుల క్రితం నాగబాబు చేసిన వ్యాఖ్యల తరహాలో ఉంది. ఆడవాళ్ళ దుస్తుల విషయంలో ఇన్ని నిభందనలు పెడుతున్నారు కదా.. ఇంతవరకు ఏ మహిళ అయినా మగవాడి బట్టల గురించి ప్రశ్నించిందా అని నాగబాబు అన్నారు. ఏ మహిళ కూడా మగాడి బట్టల గురించి కెమెంట్ చేయలేదు. అలాంటపుడు వాళ్ళ దుస్తుల విషయంలో ఎందుకు డిక్టేట్ చేస్తున్నారు అని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X