For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్ లో రెచ్చిపోయిన రష్మీ.. అతనితో కలిసి ముద్దులు పెడుతూ, మాములుగా లేదుగా!

  |

  తెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరు. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తిరుగులేని పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తుంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఆ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో రష్మీ షేర్ చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో పరిశీలిస్తే

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సినిమాల్లో పెద్దగా క్లిక్ కాలేదు కానీ బుల్లితెర మీద రష్మీ బాగా క్లిక్ అయింది. ఆమె ఉన్న అన్ని వీడియోలకు మంచి వ్యూస్ రావడమే కాక ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టిఆర్పిలు వస్తూ ఉంటాయి. రశ్మీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేయడమే కాక తనలోని సామాజిక కోణాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది.

  అప్పుడే ఎంట్రీ ఇచ్చినా

  అప్పుడే ఎంట్రీ ఇచ్చినా

  నిజానికి దాదాపు పదేళ్ల క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో చాలా చిత్రాల్లో మంచి పాత్రలు పోషించింది. కానీ ఆమెకు అవేమీ పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'జబర్ధస్త్' అనే కామెడీ షోతో రష్మీ గౌతమ్ యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని తక్కువ టైమ్‌లోనే ఎక్కువ గుర్తింపును అందుకుంది.

  ఎన్ని సినిమాలు చేసినా

  ఎన్ని సినిమాలు చేసినా

  ముందు నుంచి ఎన్నో సినిమాలు చేసిన రష్మీకి 2016లో గుంటూరు టాకీస్ సినిమాతో కాస్త బ్రేక్ వచ్చింది అనుకున్నా కానీ ఆ తర్వాత రాజు గారి బంగ్లా, అంతం, తను వచ్చెనంట లాంటి సినిమాలు చేసింది. వాటిలో ఒక్కటి కూడా సరిగా వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ నువ్వే, అంతకుమించి శివరంజని లాంటి సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. అన్నీ చిన్న చిన్న సినిమా అవకాశాలే వస్తున్నాయి కానీ పెద్ద సినిమా అవకాశం మాత్రం దక్కడం లేదు.

  సుధీర్ కారణంగా

  సుధీర్ కారణంగా

  యాంకర్‌గా రష్మీ గౌతమ్ ను స్టార్ ను చేసింది కేవలం జబర్దస్త్ షో మాత్రమే. ఈ ఒక్క దానికే తెలుగు రాష్ట్రాల్లో ఆమె పాపులర్ అయిపోయిందనుకుంటే పొరపాటే. ఈ షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న పుకార్లే ఆమెకు ఇంత క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  Recommended Video

  Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu

  ముద్దుల్తో

  ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉండే ఈ రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు దిగి వాటిని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో చర్చనీయాంశం అయింది. అయితే అది ఒరిజినల్ వీడియో కాదు. ష్రెక్ అనే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ తన పక్కనే ఉన్నట్టు వీడియో చేసిన ఆమె ఆ క్యారెక్టర్ కు ముద్దులు పెడుతూ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  Anchor Rashmi made instagram reels with animated shrek.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X