పొట్టి బట్టలేసిందా? క్లీవేజ్ చూపిందా?... 9 నెలల పసికందు దారుణంఫై యాంకర్ రష్మి!

Recommended Video

Anchor Rashmi reacts on 9 Months Baby Incident

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. 9 నెలల పసికందుపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఓ కామాంధుడు. కోలేపాక ప్రవీణ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడినట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హన్మకొండలోని టైరల్ స్ట్రీట్‌లో దంపతులు తమ 9 నెలల పాపతో మేడపై నిద్రిస్తుండగా... పాపను ఎత్తుకెళ్లిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పసికందు ప్రాణాలు విడువటంతో నిందితుడు ఆమెను మళ్లీ తల్లిదండ్రుల వద్ద పడుకోబెట్టి జారుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దారుణంపై నటి, యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు.

9 నెలల పాప పొట్టి బట్టలేసిందా? క్లీవేజ్ చూపిందా?

9 నెలల పసికందుపై జరిగిన దారుణం చూసి నా మనసు చలించి పోయింది. ఆమె ఏం తప్పు చేసింది? తప్పుగా దుస్తులు ధరించిందా? క్లీవేజ్ ప్రదర్శించిందా? కాళ్లు చూపించిందా? తన ఒపీనియన్ వెల్లడించిందా? ఏం తప్పు చేసింది? అంటూ..... రష్మి ఫైర్ అయ్యారు. మహిళల వస్త్రధారణ సరిగా లేక పోవడం వల్లే అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి అనే విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి రష్మి ఈ ట్వీట్ చేశారు.

నరేంద్ర మోదీ సార్.. బేటీ బచావో ఎక్కడ?

మరో ట్వీట్లో రష్మి రియాక్ట్ అవుతూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. ‘బేటీ బచావో బేటీ పడావో అన్నారు ఎక్కడ సార్? ఇక్కడ బేటీకి రక్షణ కూడా లేకుండా పోయింది' అంటూ వ్యాఖ్యానించారు. రష్మి చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు.

బహిరంగంగా చంపేయాలి

రష్మి ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మద్దతు ప్రకటిస్తూ... ‘ఇలాంటి వాటికి ఒకటే సొల్యూషన్. ఈ నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా చంపేయాలి. అలా చంపే సంఘటనలు లైవ్‌లో టీవీలో ప్రసారం చేయాలి. అలాంటి రోజు రావాలని, ఇలాంటి పనిష్మెంట్లు అమలు కావాల్సిన అవసరం ఉంది' అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సైకోలు మాత్రమే ఇలా చేస్తారు

సైకోలు మాత్రమే ఇలా చేస్తారు

సైకోలు మాత్రమే ఇలా చేస్తారు. ఈ దారుణానికి పాల్పడిన వాడి మానసిక స్థితి సరిగా లేదని అనుకుంటున్నాను. ఇలాంటి వారిని సమాజంలో ఉండనీయకూడదు. మరోసారి ఇవి జరుగకుండా ఉండాలంటే భయపడే విధంగా కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని మరికొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X