జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?.. రష్మి షాకింగ్ కామెంట్

Recommended Video

Anchor Rashmi Sensational Comments On Her Comedy Show || Filmibeat Telugu

సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈ షోలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగు ఎక్కువగా ఉంటున్నాయని, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సాధారణ జనాలు మాత్రమే కాదు.. కొందరు సినీ ప్రముఖులు కూడా 'జబర్దస్త్' షోపై మండి పడ్డ సందర్భాలు ఉన్నాయి. షో జడ్జి నాగబాబు సైతం గతంలో పలు సందర్భాల్లో కొన్ని స్కిట్లు శృతి తప్పిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తాజాగా మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగుకు వచ్చిన రష్మికి జబర్దస్త్ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

కాంట్రవర్సీలు మేము కాదు, మీరు చేస్తున్నారు

కాంట్రవర్సీలు మేము కాదు, మీరు చేస్తున్నారు

జబర్దస్త్ షోపై చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ... ‘కాంట్రవర్సీలు మేము కాదు, మీరు చేస్తున్నారు. మేము చాలా ఎంటర్టెన్మెంట్ అందించాలనుకుంటాం. దాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది.'' అని రష్మి వ్యాఖ్యానించారు.

ప్రైమ్ టైమ్ షో అనేది అడల్ట్స్ కోసమే అంటున్న రష్మి

ప్రైమ్ టైమ్ షో అనేది అడల్ట్స్ కోసమే అంటున్న రష్మి

‘‘ప్రైమ్ టైమ్ షో అనేది అడల్ట్స్ కోసం... అడల్ట్స్ అంటే వారికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఏది తీసుకోవాలి, ఏది ఫిల్టర్ చేయాలనే సెన్స్ ఉంటుంది. ఆ కెపాసిటీ మేము మీకిస్తున్నాం, ఓటింగ్ హక్కుతో పాటు ఆలోచించే హక్కు మీకు ఉంది.'' అని రష్మి వ్యాఖ్యానించారు.

జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?

జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?

రష్మి కామెంట్స్ విన్న వారంతా... ‘‘జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?'' అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు షోలో ముందుస్తుగా ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన షో అని సూచనలు ఇవ్వొచ్చుగా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్

జబర్దస్త్

తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఏపీ, తెలంగాణలో ఏ టీవీ షోకు లేనంత రెస్పాన్స్ ఈ షో సొంతం చేసుకుంది. ఇది ప్రారంభమై దాదాపు ఐదేళ్ల దాటిపోయినా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రేటింగ్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలుస్తోంది.

కొత్త జడ్జీలు

కొత్త జడ్జీలు

ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు షోలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకు కామెడీలో సరికొత్త కోణం చూపిస్తూ ఎంటర్టెన్ చేస్తున్నారు. జబర్దస్త్ షోకు ప్రధాన ఆకర్షణ రోజా, నాగబాబు. ఈ ఇద్దరూ జడ్జిలుగా కొనసాగడం కూడా షో మరింత రక్తి కట్టడానకి మరో కారణం. అయితే వీరు ఎన్నికల వేళ అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీ కావడంతో షో చేయలేని పరిస్థితి. దీంతో వారి స్థానంలో కొత్త జడ్జిలుగా శేఖర్ మాస్టర్, మీనా ఎంట్రీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X