twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రవి చూసిన మొట్టమొదటి సినిమా అదేనట.. అందుకే అలా అయ్యాడేమో?

    |

    బుల్లితెరపై యాంకర్ రవి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. రవి లాస్య, రవి శ్రీముఖి, రవి వర్షిణి ఇలా ప్రతీసారి ఓ జోడితో బుల్లితెరపై కెమిస్ట్రీని ఇరగదీశాడు. ఒకప్పుడు రవి లాస్య అంటే బుల్లితెరపై ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. ఆ తరువాత ఆమె స్థానంలో శ్రీ ముఖి వచ్చి చేరింది. ఇలా రవి పక్కన అమ్మాయిలు మారుతున్నారే తప్పా అతను మాత్రం అలానే ఉన్నాడు. బుల్లితెరపై తనదైన పంచ్‌లతో దూసుకుపోయే రవి సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. రవి పెళ్లి విషయంలో తెలుగు మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

    ఎన్నో మలుపుల తరువాత..

    ఎన్నో మలుపుల తరువాత..

    రవికి పెళ్లి అయిందా? లేదా? అయితే ఆ అమ్మాయి ఎవరు? ఇలా కొన్నేళ్లు యూట్యూబ్ చానెల్స్ ఇన్వెస్టిగేషన్ చేశాయి. ఇక లైవ్‌లోకి వచ్చినా, ఏదైనా ప్రోగ్రాంలోకి వచ్చాని రవి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యేవి. ఇక చివరగా ఈ పోరును భరించలేక తన భార్య నిత్య, పాపను అందరికీ పరిచయం చేశాడు.

    బుల్లితెరపై క్రేజ్...

    బుల్లితెరపై క్రేజ్...

    అలా ఎన్నో యేళ్లుగా బ్యాచ్‌లర్, సింగిల్ కింగులం అంటూ చెప్పుకున్న రవికి ఓ పాప కూడా ఉండటంతో అంతా షాక్ అయ్యారు. అయితే రవి తన ఫ్యామిలీని పరిచయం చేసిన తరువాత కొన్ని ఈవెంట్లలో పాపతో కలిసి చేసిన పర్ఫామెన్స్‌ ఇంకా హైలెట్ అయ్యాయి. ఇలా బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా వెండితెరపైనా మెరిశాడు.

    హీరోగానూ నటించాడు..

    హీరోగానూ నటించాడు..

    బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగా నటించాడు. ఇదే మా ప్రేమ కథ అనే ఓ చిత్రం నటించాడు. ఈ సినిమాను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు. అయితే తనకు మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య దైవమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే రవికి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టమో తాజాగా తెలిసింది.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    చూసిన మొదటి చిత్రం..

    చూసిన మొదటి చిత్రం..

    సాయి కుమార్ నిర్వహిస్తోన్న వావ్ 3 షోలో రవి పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మొట్టమొదటగా మీరు చూసిన సినిమా ఏంటని సాయి కుమార్ ప్రశ్నించగా.. ముఠా మేస్త్రీ అంటూ రవి సమాధానమిచ్చాడు. అమ్మనాన్నలతో ఆ చిత్రం చూశానని పేర్కొన్నాడు. అందుకే రవి చిరంజీవి ఫ్యాన్ అయిపోయి ఉంటాడని తెలుస్తోంది.

    English summary
    Anchor Ravi About First Movie Watched In His Life. Anchor Ravi Participated In Sai Kumar Wow 3 Show. He Revealed That Muta mesthri movie Watched First
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X