twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ మొదలయ్యింది: లాస్యతో గొడవకు కారణాలు చెప్పిన యాంకర్ రవి

    టీవీ షో లలో ఒకప్పుడు మారుమోగిన యాంకర్స్‌ పేరు రవి,లాస్య వీరిద్దరు బుల్లితెర పై చేసే యాంకరింగ్ ప్రేక్షకులను బాగా అలరించింది.

    |

    టీవీ షో లలో ఒకప్పుడు మారుమోగిన యాంకర్స్‌ పేరు రవి,లాస్య వీరిద్దరు బుల్లితెర పై చేసే యాంకరింగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. బుల్లితెరమీదనే కాదు బయట జరిగే ఈవెంట్లలో కూడా ఈ ఇద్దరూ చక్కటి యాంకర్ జోడీ గా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల కిందట వీరిద్దరికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు మరి. ఈ ఇద్దరిమీదా వచ్చినన్ని రూమర్లూ టాలీవుడ్ సినీ తారలేఎద కూడా రాలేదంటే ఆశ్చర్యం లేదు.

    ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతగా

    ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతగా

    రవి.. లాస్య కలిసి చాలా టీవీ,స్టేజ్ షోలు చేశారు. ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘సంథింగ్ స్పెషల్' సూపర్ పాపులరైంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతగా ఉండేది వాళ్ల కెమిస్ట్రీ. ఐతే తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ మధ్యే లాస్య పెళ్లి చేసుకుని సెటిలైంది.

     ఆలీ అడిగిన ప్రశ్నకి సమాధానం గా

    ఆలీ అడిగిన ప్రశ్నకి సమాధానం గా

    వారిద్దరి మధ్య విభేదాలే ఈ దూరానికి కారణం అని ఒకరు కాదు రూమర్స్‌ వల్లే విడిపోయారని ఇంకొకళ్ళూ చెప్తూ వచ్చారు. అయితే ఇందులో ఏ విషయం నిజం అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే ఆలీ హోస్ట్‌గా కొనసాగుతున్న ఓ షోలో శ్రీముఖి, రవి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చారు. ఇదే సందర్భం లో ఆలీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా లాస్యతో తన దూరానికి కారణాన్ని ఇలా చెప్పాడు రవి.

    థర్డ్ సీజన్ నాకు వచ్చింది

    థర్డ్ సీజన్ నాకు వచ్చింది

    నేను, లాస్య ఓ డ్యాన్స్ షోలో చేసేవాళ్లం.. టు సీజన్స్ అయిపోయాయి. థర్డ్ సీజన్ నాకు వచ్చింది. నేను యాంకరింగ్ చేస్తాను.. టీమ్ లీడింగ్ నేను చేయను అన్నాను. లాస్యతో టీమ్ లీడింగే చేయిస్తున్నారు. నేను మాత్రం యాంకరింగే చేస్తానన్నాను. డైరెక్టర్ కూడా నాకు యాంకరింగే అని చెప్పారు.

     నేను చేయను

    నేను చేయను

    అప్పుడు లాస్య వాడు యాంకరింగ్ చేస్తే.. వాడి పక్కన నేను యాంకరింగ్ చేస్తాను అన్నది. వాడు యాంకరింగ్ చేస్తే.. నేను వేరే అబ్బాయితో టీమ్ లీడింగ్ చేయాలా? నేను చేయను అని లాస్య అన్నది. అక్కడ చెడిపోయింది. నాకూ రాలేదు.. తనకూ రాలేదు.. నాకు వేరే షోలు వచ్చాయి. నాకు పటాస్.. అదే విధంగా వేరే షోస్ నడుస్తున్నాయి. తనని సైడ్ పెట్టేశారు. ఎందుకంటే రవితోనే పెయిర్ బాగుంటుందని.

    ఇక్కడికి ఆపేస్తే బెటర్

    ఇక్కడికి ఆపేస్తే బెటర్

    అక్కడ చెడిపోయింది. నీవల్లే నాకు షోలు లేకుండా పోయాయంటూ ఫుల్ నెగెటివ్‌లో వెళ్లిపోయింది లాస్య. సరే ఓకే.. ఇప్పటి వరకూ దగ్గరుండి ఇది చెయ్.. అది చెయ్.. అని చెప్పిన రోజులున్నాయి. రవి అనే పేరు వచ్చిందంటే నీ వల్లే.. కానీ నువ్వు అపార్థం చేసుకున్నావు.. దీనికి నేను ఎంత వివరణ ఇచ్చినా వినవు. ఇక్కడికి ఆపేస్తే బెటర్ అంతే." అని తనకూ, లాస్యకు మధ్య జరిగిన సంఘటనను వివరించాడు రవి.

    English summary
    Telugu TV Anchor Ravi reveald issues with his Co Anchor Lasya, in a TV shoa with Star Comedian Ali
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X