పటాస్‌కు గుడ్‌బై ఎందుకు చెప్పానంటే.. శ్రీముఖితో విభేదాలపై యాంకర్ రవి!

బుల్లితెర మీద పటాస్ షో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచిందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాంకర్లు రవి, శ్రీముఖి జోడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఇలాంటి పాపులర్ షో నుంచి శ్రీముఖి, రవి వెళ్లిపోవడంతో రకరకాల పుకార్లు మీడియాలో వచ్చాయి. అలాంటి రూమర్లకు యాంకర్ రవి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఇంటర్వ్యూలో..

పటాస్ షో నుంచి రావడం బాధే

పటాస్ షో నుంచి రావడం బాధే

పటాస్ షో నుంచి బయటకు రావడం చాలా బాధ కలిగింది. నాలుగేళ్లపాటు రక్తాన్ని చెమటగా మలిచి షోను మరింతగా తీర్చిదిద్దాం. జీవితం కంటే ఎక్కువగా ప్రేమించిన అలాంటి షోను వీడటం కాస్త జీర్ణించుకోలేని విషయమే. అదే నా ముఖంలో కనిపిస్తుంటుంది. కొన్ని నిజాలు చెప్పాలంటే యాంకర్లు భయపడుతున్నారు అని యాంకర్ రవి పేర్కొన్నారు.

పటాస్ షో భారంగా

పటాస్ షో భారంగా

సమ్‌థింగ్ స్పెషల్ డెయిలీ షో చేశాను. దాదాపు నాలుగు సంవత్సరాల్లో 900 ఎపిసోడ్స్ చేశాను. 15 రోజులు వరుసగా పనిచేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సమయం ఉండేది కాదు. అలాగే పటాస్ షో కూడా నా జీవితంలో భాగంగా మారింది. అలాంటి పరిస్థితులు నాపై భారంగా మారాయి. దాంతో వారానికి ఒక్క షో చేస్తే చాలు అనే ఫీలింగ్ ఏర్పడింది అని అన్నారు.

పటాస్ డైరెక్టర్ సంతోష్ వెళ్లిపోవడం

పటాస్ డైరెక్టర్ సంతోష్ వెళ్లిపోవడం

పటాస్‌ షోకు కీలకమైన డైరెక్టర్ సంతోష్ వెళ్లిపోవడం కాస్త డిస్ట్రబ్ అనిపించింది. ఆ తర్వాత శ్రీముఖి కూడా వెళ్లిపోవడం మరింతగా బాధకలిగించింది. శ్రీముఖికి వేరే అవకాశం రావడం వల్ల ఆమె వెళ్లిపోయింది. ఎవరికి మంచి అవకాశాలు వస్తే వారు వెళ్లిపోతారు. ఎవరైనా స్కూల్‌లో చదివిన తర్వా కాలేజ్‌కు వెళ్లాలనుకొంటారు. యాంకర్ల విషయంలో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు అని యాంకర్ రవి తెలిపారు.

పవన్ కల్యాణ్ పక్కన నటించే అవకాశం

పవన్ కల్యాణ్ పక్కన నటించే అవకాశం

పటాస్‌లో చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌ పక్కన నటించే అవకాశం వచ్చింది. అప్పుడు పటాస్ కంటే పవన్ కల్యాణ్ పక్కన ఆఫర్ నాకు బాగా మెరుగనిపించింది. కాబట్టి పటాస్‌ను వదులుకొన్నాను. కెరీర్ విషయానికి వస్తే ఎవరైనా మరో లెవెల్‌కు వెళ్లాలని కోరుకొంటారు. అందుకే పటాస్ షోను వదిలేశాను అని యాంకర్ రవి పేర్కొన్నారు.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
పటాస్‌లో పంచ్‌లు రెగ్యులర్‌గా

పటాస్‌లో పంచ్‌లు రెగ్యులర్‌గా

పటాస్‌లో పంచ్‌లు రెగ్యులర్‌గా మారాయి. కొత్తగా ఏమి ఉండటం లేదనే మాటలు వినిపించాయి. దాంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ ఫ్రెష్‌గా వద్దామని నిర్ణయం తీసుకొన్నాం. పవన్ కల్యాణ్‌తో నటించడం ఓ కల. అంతేగానీ నిర్వాహకులతోను, శ్రీముఖితోను ఎలాంటి గొడవ లేదు అని యాంకర్ రవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X