రేణుదేశాయ్‌కి మెమొరీ లాస్.. ఆటపట్టించిన యాంకర్ రవి.. అసలేం జరిగిందంటే
కరోనాతో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న యాంకర్ రవి తన తాజా షోతో దూసుకెళ్తున్నారు. లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి షోకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇటీవలే ప్రారంభించిన ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఈ ఫన్నీ షోలో ఈ వారం రేణుదేశాయ్, జానీ మాస్టర్ పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన విశేషాలను టీజర్‌గా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్‌లో ఫన్నీ షో
లాక్‌డౌన్‌లో సినీ, టెలివిజన్ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ వారు ఫ్యాన్స్‌తో జూమ్, వాట్సప్ కాల్స్‌తో ముచ్చటించారు. కానీ యాంకర్ రవి మాత్రం ఈ లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొన్నారు. లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి కార్యక్రమాన్ని ప్రారంభించి వినోదాన్ని పంచుతున్నారు. ఈ షో ప్రతీ శని, ఆదివారం జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్నది.

రేణుదేశాయ్, జానీ మాస్టర్‌తో
తాజా ఎపిసోడ్ టీజర్ విషయానికి వస్తే.. ఈ షోలో జానీ మాస్టర్ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్‌ను తనదైన శైలిలో చేసి చూపించారు. భయంకరంగా ఫోజులు పెడుతూ నిర్మా యాడ్‌ను ప్లే చేశారు. జానీ మాస్టర్ నిర్మా యాడ్ చూసి యాంకర్ రవి, రేణుదేశాయ్ నవ్వుల్లో మునిగిపోయారు. ఇలా జానీ మాస్టర్ రెచ్చిపోయి మరికొన్ని ఫీట్లు చేశారు.

నేను గాలిలోకి ఎగురుతానా?
ఇక రేణుదేశాయ్ గురించి యాంకర్ రవి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. రేణుదేశాయ్‌కి గాలిలో తేలిపోయే ఓ స్ట్రెంగ్త్ ఉందని రవి చెబితే.. దానికి సమాధానం ఇస్తూ.. నేను ఎంత లావుగా ఉన్నానో, నా బరువు చూశావా? నేను గాలిలో లేవగలనా అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

మతిమరుపుతో కారులో కూర్చొని
ఇక రేణుదేశాయ్ మతి మరుపు గురించి వివరిస్తూ యాంకర్ రవి ఆటపట్టించారు. ఆమె మతి మరుపు ఏం రేంజ్‌లో ఉందంటే.. కారులో ఆమె కూర్చొని కిక్ రాడ్ కోసం కిక్ కొట్టడానికి వెతుకుతున్నారట అంటూ రేణుదేశాయ్ విషయాలను బయటపెట్టారు. ఇలా చాలా ఫన్నీగా ఎపిసోడ్ సాగినట్టు టీజర్ స్పష్టం చేసింది.
Recommended Video

టాలీవుడ్ సెలబ్రిటీలతో హంగామా
గతవారం లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి షోలో నాగబాబు, అనసూయ పాల్గొన్నారు. అనసూయను రవి ఆటపట్టిసేత.. యాంకర్ రవిని నాగబాబు చిలిపి ప్రశ్నలతో విసిగించారు. అంతకుముందు యాంకర్ భాను శ్రీ, ధన్‌రాజ్, వేణు, సుమ కనకాల, కుష్బూ సుందర్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇలా లాక్‌డౌన్‌ను యాంకర్ రవి చాలా ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకోవడం అందర్నీ ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











