twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ మొదలైన వ్యవహారం.. లాస్యతో యాంకర్ రవి రొమాన్స్.. సెగలు పుట్టించిన జోడి

    |

    ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ రవి లాస్యలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెరపై ట్రాకులు, పులిహోర అనేది ఈ ఇద్దరి నుంచే మొదలైనట్టుంది. బుల్లితెరపై ఓ షోలో కనిపించి, కెమిస్ట్రీ వర్కవుట్ అయి ఓ జంటకు అంత పేరు రావడం అదే మొదటిసారి. అలా మార్నింగ్ షోతో గుడ్ మార్నింగ్ అంటూ చెబుతూ మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం విజయవంతంగా కొనసాగింది. బుల్లితెరపై రవి లాస్య అంటే ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

     అలా ఫేమస్..

    అలా ఫేమస్..

    రవి లాస్య అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారికి కూడా రవి లాస్య జంటకు క్రేజ్ ఉంటుంది. సంథింగ్ స్పెషల్ అంటూ ఉదయాన్నే అందరినీ పలకరించేవారు. ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వచ్చి ఈవెంట్లు చేయడం, స్పెషల్ సాంగ్స్ చేయడం వంటి చేస్తూ అప్పట్లో దుమ్ములేపేశారు.

     అలా దూరం..

    అలా దూరం..

    అయితే రవి లాస్యలు మధ్యలో దూరమయ్యారు. కలిసి షోలు చేయడం మానేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విబేధాల గురించి అందరికీ తెలిసిపోయింది. దాదాపు ఐదేళ్లుగా ఈ ఇద్దరూ కూడా కలిసి ఒక్క షోను హోస్ట్ చేయలేదు. ఒకే ఈవెంట్‌లోనూ కలిసి కనిపించలేదు. కానీ ఈ మధ్య వాటన్నంటిని మరిచిపోయి ఒక్కటయ్యారు.

     ఆ షోతో రచ్చ..

    ఆ షోతో రచ్చ..

    సంక్రాంతి స్టార్ మాలో వచ్చిన ఈవెంట్‌తో రవి లాస్యలు ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్ల తరువాత అలా కలిసి ఒకే షోను హోస్ట్ చేయడం, ఒకే స్టేజ్ మీద కనిపించడంతో వారి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. అయితే ఆ ఈవెంట్ తరువాత మళ్లీ ఎక్కడా కూడా కలిసి నటించలేదు.

     సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    రవి లాస్య మధ్య ఉన్న మనస్పర్దలన్నీ తొలిగిపోయాయని వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తేనే తెలిసిపోతుంది. ఇద్దరూ కూడా మునుపటిలా మంచి స్నేహితుల్లా కలిసే ఉంటున్నారు. సోషల్ మీడియాలో లైవ్‌లోకి కూడా వస్తున్నారు. తాజాగా కామెడీ స్టార్స్‌లో ఈ ఇద్దరూ చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

    ఉప్పెన స్ఫూప్..

    ఉప్పెన స్ఫూప్..

    కామెడీ స్టార్స్ అనే షోలో ఉప్పెన స్ఫూప్‌లో రవి లాస్య నటించారు. జలజలపాతం అనే పాటకు అదిరిపోయేలా రొమాన్స్ చేశారు. జ్వరం కావాలా? అంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది లాస్య. మొత్తానికి ఈ ఇద్దరూ మళ్లీ మునుపటిలా సెగలు పుట్టించి రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

    English summary
    Anchor Ravi and lasya Romantic dance In Comedy stars show,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X