వివాదంలో యాంకర్ రవి .. చిరంజీవి పేరు లాగుతూ , ఆడియో టేప్ వైరల్

సెలబ్రెటీలుగా ఉన్న వారి మాటలు, చేతలకు సమాజంలో చాలా ప్రభావం ఉంటుంది. అందుకే వారేం చేసినా, మాట్లాడినా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి . లేదంటే దాని వల్ల చోటు చేసుకునే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుపోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా తెలుగు నాట స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న యాంకర్ రవి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

యాంకరింగ్ అంటేనే ఫిమేల్ డామినేషన్. ఇక్కడ యాంకరింగ్ అనగానే సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి వారి పేర్లు, ముఖాలు టక్కున గుర్తొస్తాయి. ఇలాంటి చోట అబ్బాయిలు అడుగుపెట్టగలరా? ఒకవేళ వచ్చినా సక్సెస్ కొట్టగలారా? అని అందరికీ ఓ డౌట్ ఉండేది. కానీ ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ వంటి వారు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా యాంకరింగ్‌లో కింగ్‌లేనని ప్రూవ్ చేశారు.

anchor ravi apologized Hindu community for doing a controversial skit

ఈ కోవలోకే వస్తారు యాంకర్ రవి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈయన బీటెక్ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాలని చాలా గట్టిగా ట్రై చేశారు. కానీ ప్రతిచోటా నిరాశే ఎదురుకావడంతో కొరియోగ్రఫీ వైపు వెళ్లాడు. ఈ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఇచ్చిన సలహా రవిని యాంకరింగ్ వైపు నడిపించింది. వెంటనే మాటీవీలో యాంకర్‌గా జాయినై సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో పలకరించారు. యాంకర్ లాస్య జోడీగా రవి చెలరేగిపోయాడు. దాంతో ఈ షోకు మంచి స్పందన వచ్చింది.

షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలలో చిన్నా చితకా పాత్రలు వేస్తూ వచ్చి యాంకర్ రవి బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని అనుకున్నప్పటికీ.. అనుకోని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ క్రేజ్‌తో ఆయనకు యువతలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా ఓ ఛానెల్‌లో సుడిగాలి సుధీర్‌తో కలిసి రవి చేసిన స్పూఫ్ వివాదాస్పదమైంది. అందులో నందీశ్వరుడి కొమ్ములలో నుంచి చూస్తే శివుడు కాకుండా అమ్మాయి కనిపించడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.

ఓ హిందూ సంస్థకు చెందిన వ్యక్తి యాంకర్ రవికి ఫోన్ చేసి ఇలాంటివి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చేసినదానికి హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో రవి సీరియస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారు బావగారు బాగున్నారు అనే సినిమాలో ఇదే సీన్ చేశారని, ఆయన చేసింది తప్పు కాకుంటే , మేం చేసింది కూడా తప్పు కాదని కౌంటర్ ఇచ్చారు. మేం ఏ దేవుడిని కించపరచలేదని, పైగా నందీశ్వరుడిని వేదిక మీదకి తీసుకొచ్చే సమయంలో అందరం చెప్పులు విప్పేసి స్కిట్ చేశామని రవి తెలిపాడు.

కొందరి మనోభావాలు దెబ్బతిన్నట్లుగా తెలియడంతో వెంటనే వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశామని అంతకుమించి మేం ఏ తప్పూ చేయలేదని రవి అన్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ తాలూకా ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ కాసేపటికే తాము స్కిట్‌ వల్ల కొందరు బాధపడ్డారని.. అలా చేయడం తప్పంటూ ఫోన్ కాల్స్ రావడంతో భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని క్షమాపణలు చెప్పారు యాంకర్ రవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X