బెలూన్స్ ఎక్కడ వాడాలంటే.. బిగ్‌బాస్ బ్యూటీతో యాంకర్ రవి బోల్డ్ కామెంట్స్

యాంకరింగ్ అంటేనే ఫిమేల్ డామినేషన్. అందాలు ఆరబోయాలి.. సమయస్పూర్తితో కార్యక్రమాన్ని అద్భుతంగా హోస్ట్ చేయాలి. ఇలాంటి చోట అబ్బాయిలు అడుగుపెట్టగలరా? ఒకవేళ వచ్చినా రాణించగలారా? అని అనుమానాలు ఉండేవి. అయితే ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ వంటి వారు ఈ అంచనాలు తప్పని నిరూపించారు. తలచుకుంటే అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా యాంకరింగ్‌లో సత్తా చాటగలరని వీరు రుజువు చేశారు.

నాగ్ సలహాతో యాంకరింగ్‌లోకి
ప్రదీప్ మాచిరాజు, సుధీర్ కోవలోకే వస్తారు యాంకర్ రవి. సినీ రంగంలో వెలిగిపోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చాలా గట్టిగా ట్రై చేశాడు రవి. కానీ ప్రతిచోటా నిరాశే ఎదురుకావడంతో కొరియోగ్రఫీని కెరీర్‌గా చేసుకోవాలని అనుకున్నారు. అయితే కింగ్ అక్కినేని నాగార్జున ఇచ్చిన సలహాతో యాంకరింగ్ వైపు వచ్చాడు. స్టార్ మాలో పలు షోలకు యాంకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరో యాంకర్ లాస్యతో కలిసి ప్రేక్షకులను అలరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి.

Anchor Ravi bold comments with Bigg Boss fame Tejaswi Madivada

స్టార్ యాంకర్‌గా ఫేం
షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాలలో నటించి తన కల నిజం చేసుకుని తెలుగు నాట స్టార్ యాంకర్‌లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు రవి. ఈ దశలో బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు రవి. ఆ సమయంలో తన మైండ్ గేమ్, డిస్కషన్స్‌తో ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ప్రేక్షకులు ఆయనను మధ్యలోనే ఎలిమినేట్ చేశారు. బిగ్‌బాస్‌ను వీడిన తర్వాత యాంకర్ రవికి యువతలో ఫాలోయింగ్ పెరిగిపోయింది.

చలపతి రావు వ్యాఖ్యలతో వివాదం
తన షోలు, ఈవెంట్స్‌తో పాటు పలు వివాదాల్లోనూ యాంకర్ రవి పేరు తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఈవెంట్‌లో దివంగత నటుడు చలపతిరావుతో చేసిన ఫన్నీ ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఆ సమయంలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై అప్పట్లోనే యాంకర్ రవి వివరణ ఇచ్చారు. చలపతిరావు చేసిన కామంట్స్ ముమ్మాటికీ తప్పేనని.. ఆయనేదో పంచ్ విసిరారని అనుకున్నానని, ఆ గోలలో నాకేం అర్ధం కాలేదని యాంకర్ రవి వివరణ ఇచ్చాడు. తనకూ అమ్మా, చెల్లి ఉన్నారని చెప్పాడు. ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది.

తేజస్వితో బోల్డ్ కామెంట్స్
తాజాగా యాంకర్ రవి మరోసారి నోరుజారాడు. బిగ్‌బాస్ ఫేం, సినీ నటి తేజస్వి మదివాడ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బుల్లితెర నటి తేజస్విని గౌడతో కలిసి పాల్గొన్న ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో తొలుత బెలూన్స్, సేఫ్టీ అని తేజస్వి అడగ్గా దానికి వెరీ ఇంపార్టెంట్ అని రవి బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు. కట్ చేస్తే అని రవి అనగా.. ఎవరిది కట్ చేస్తే అని తేజస్వి పంచ్ విసురుతుంది. అందరూ బ్యూటీలు బుక్ అయ్యారని రవి అనగా.. నేను మాత్రం సింగిల్ అని తేజస్వి ఆన్సర్ ఇచ్చింది. ఫైనల్‌గా నేను బెలూన్స్ సేఫ్టీ ఎక్కడ వాడాలి అని రవి ప్రశ్నించడంతో తేజస్వి లేచి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావ్.. నేను అడిగానా అని ఎదురు ప్రశ్నించింది. నువ్వు వెళ్లు అలాంటి వాటికి నేనేందుకు అని తేజస్వి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వీరిపై ట్రోలింగ్‌కు దిగారు. సెలబ్రెటీలు అయ్యుండి.. లైవ్‌ షోలో అలాంటి మాటలెంటీ అని ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X