రాత్రివేళ లేడీ యాంకర్ ఇంట్లో రచ్చ.. సంబరాల్లో మునిగితేలిన రవి అండ్ కో
బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్‌కు కొదవే ఉండటం లేదు. రోజుకో కొత్త షో పుట్టుకోస్తొంది. ఇలాంటి పోటీ తరుణంలో యాంకర్ రవి, వింధ్య మేడపాటి కలిసి ఓ షోను హోస్ట్ చేయడం, అది కూడా బాగానే వైరల్ అవ్వడం జరిగింది. భార్య భర్తల మధ్య ఉండే పోట్లాటలు, సరాదాలు, సరసాల నేపథ్యంతో నువ్వు రెడీ నేను రెడీ అనే షోను ప్రారంభించారు. గత వారం మొదలైన ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో షో సక్సెస్ కావడంతో అందరూ సంబరాలు చేసుకున్నారు.

యాంకరింగ్‌లో కింగ్..
యాంకర్ రవి మొదటి నుంచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు. సెటైర్స్, పంచ్‌లు వేయడంలో యాంకర్ రవి స్పెషల్. ఎప్పడూ తన పక్కన ఓ లేడీ యాంకర్ ఉండటం, ఆమెపై పంచ్‌లో రెచ్చిపోవడం, ఆ కెమిస్ట్రీ జనాలకు నచ్చడంతో బాగా పాపులర్ అయ్యేవాడు. లాస్య, శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిణి ఇలా ఎంతో మంది తన పక్కన మారినా కానీ రవి క్రేజ్ మాత్రం మారలేదు.

కెమిస్ట్రీ హైలెట్..
యాంకర్ రవి ఎవరితో కలిసి హోస్టింగ్ చేసినా అందులో ఓ స్పెషాల్టీ ఉంటుంది. జనాలు కూడా ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. అదిరింది షోలో భాను శ్రీతో కలిసి హెస్టింగ్ చేయడం, అది కూడా బాగానే క్లిక్కవ్వడం కలిసివచ్చింది. కొత్తగా ప్రారంభమైను నువ్వు రెడీ నేను రెడీ షోలో కూడా వింధ్యతో కలిసి రవి రెచ్చిపోవడం, వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో షో హైలెట్ అవుతోంది.

ఇద్దరి పర్ఫామెన్స్..
షోలో వచ్చే కంటెస్టెంట్ల కంటే వీరి పర్ఫామెన్స్ హైలెట్ అవుతోంది. సెలెబ్రిటీ జంటలను పిలిపించి వారితో ఆటాడించే క్రమంలో రవి, వింధ్యలు రెచ్చిపోతున్నారు. తాజాగా సీతయ్య సినిమాలోని సమయానికి తగు సేవలు చేయనీ అనే పాటకు రెచ్చిపోయి నటించారు.
Recommended Video

సంబరాల్లో బృందం..
నువ్వు రెడీ నేను రెడీ అనే షో హిట్ అయినందుకు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాత్రి యాంకర్ వింధ్య ఇంట్లో అందరూ కలిసినట్టు, ఎంజాయ్ చేసినట్టు తెలుపుతూ యాంకర్ రవి ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వేడుకల్లో అందరూ డ్యాన్సులు చేయడం, కేక్ కట్ చేయడం, ఎంచక్కా అందరూ కలిసి భోజనం చేయడం కనిపిస్తోంది. ప్రస్తుతం యాంకర్ రవి షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











