Priyanka Singh పెళ్లి వార్తలపై యాంకర్ రవి క్లారిటీ.. ఒకటి మిస్సింగ్ అంటూ..
ఇటీవల ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఒక విధంగా అందరూ ఆ విషయం నిజమే అనుకున్నారు. ప్రస్తుతం కూడా ఇంకా మరికొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ రవి ప్రియాంక సింగ్ పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేసి తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ లోకి
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. మొదట సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకున్నా ప్రియాంక సింగ్ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇక జబర్దస్త్ లో మొదటి అవకాశం అందుకొని అక్కడ చాలా కాలం పాటు ఆమె మంచి ఆదాయాన్ని అందుకుంది. ఇక అటువైపు నుంచి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టగానే ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఎమోషనల్ బాండింగ్
బిగ్బాస్ 5వ సీజన్ లో మంచి గుర్తింపు అందుకున్న ప్రియాంక సింగ్ ఒక విధంగా తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది. అప్పటివరకు ప్రియాంక అంటే కేవలం జబర్దస్త్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు కానీ బిగ్ బాస్ తర్వాత ఆమె ప్రేక్షకులు అందరికీ కూడా దగ్గరయింది. బిగ్ బాస్ లో అందరిలో ఎక్కువగా ఎమోషనల్ గా టచ్ అయిన వారిలో ఆర్టిస్ట్ ప్రియా, యాంకర్ రవి కూడా ఉన్నారు. ముఖ్యంగా రవితో ఆమె ఒక సోదర భావంతో మెలిగింది.

సోషల్ మీడియాలో మంచి క్రేజ్
బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా ప్రియాంక బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో కూడా చాలా స్నేహంగా కొనసాగుతూ వచ్చింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను కూడా నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో అయితే ప్రియాంక ఈ మధ్య తరచుగా ఎక్కువగా వీడియోలను పోస్ట్ చేస్తోంది. అలాగే ఫోటోలకు కూడా భారీ స్థాయిలో లైక్స్ అయితే వస్తున్నాయి.

హల్దీ వీడియో వైరల్
ఇక ప్రియాంక సింగ్ రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా ఒక వీడియో పోస్ట్ చేయడంతో అది నిమిషాల్లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆ వీడియో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసింది. హల్దీ వేడుకకు సిద్ధమవుతున్నట్లు కొత్త పెళ్లికూతురిలా ప్రియాంక సింగ్ పసుపు బట్టలతో దర్శనమివ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేకరకాల వార్తలు వచ్చాయి.

యాంకర్ రవి రియాక్షన్
ఇక ఆమెను ఒక సోదరిగా భావించే యంకర్ రవి ఆ వార్తలపై వివరణ కూడా ఇచ్చాడు. యాంకర్ రవి ఒక వీడియో పోస్ట్ చేస్తూ నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైముంది అని తెలియజేశాడు. 'ఎందుకంటే ఆమెకు మధ్యలో ఒక పన్ను మిస్సింగ్ అంటూ ముందు దాన్ని సెట్ చేయాలి' అని ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇక వీడియోలో ప్రియాంకకు ఒక దంతం లేదు అన్నట్టుగా వీడియో క్రియేట్ చేయడం వైరల్ అవుతుంది. ఇక దానికి ప్రియాంక స్పందిస్తూ చీ! అన్నయ్య అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











