For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి బండారం బయటపెట్టిన అసిస్టెంట్: అందుకే అలాంటి ఫొటోలు.. మరో దరిద్రమన్న రవి

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్లో చాలా మంది భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా సినిమాలు, సీరియళ్లు, షోలలో అవకాశాలను అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. ఇలా చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన బ్యూటీ అషు రెడ్డి. ఈమె కొంత కాలంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హల్‌చల్ చేస్తోంది.

  ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అలాంటి ప్రయోగమే చేసింది. దీనికి సంబంధించిన వీడియోను యాంకర్ రవి షేర్ చేశాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  ఆ వీడియోలతో అషు ఫుల్ ఫేమస్

  ఆ వీడియోలతో అషు ఫుల్ ఫేమస్

  అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి ఫేమస్ అయింది. స్టార్ హీరోయిన్ సమంత పోలికలతో ఉన్న ఆమెను అందరూ జూనియర్ సామ్ అనేవాళ్లు. దీంతో ఈ బ్యూటీ లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ‘ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరోసారి తెగ సందడి చేసేసింది.

  ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

  లవ్ ట్రాకులతో రచ్చ... వార్తల్లోనే

  లవ్ ట్రాకులతో రచ్చ... వార్తల్లోనే

  అషు రెడ్డి కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి అనుమానాలు పెంచింది.

  నటిగా, యాంకర్‌గా రచ్చ చేస్తోంది

  నటిగా, యాంకర్‌గా రచ్చ చేస్తోంది

  ఈ మధ్య అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ‘కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లు చేస్తోంది. అదే సమయంలో ‘హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి కొన్ని స్పెషల్ ఈవెంట్లు, షోలలో కనిపిస్తూ రచ్చ చేస్తోంది.

  షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఫస్ట్ పోస్ట్: నా వెనుక తను ఉన్నాడంటూ వీడియో రిలీజ్

  అక్కడ మాత్రం బ్యూటీ హల్‌చల్

  అక్కడ మాత్రం బ్యూటీ హల్‌చల్

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంటోంది.

  అలాంటి ఫొటోలు.. మీమ్స్‌, ట్రోల్స్

  అలాంటి ఫొటోలు.. మీమ్స్‌, ట్రోల్స్

  అషు రెడ్డి ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోషూట్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె కింద కూర్చుని ఉన్న ఫొటోలపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు, వీటిపై మీమ్స్ క్రియేట్ చేసి మరీ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు.

  జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

  బండారం బయటపెట్టిన కుర్రాడు

  బండారం బయటపెట్టిన కుర్రాడు

  తాజాగా యాంకర్ రవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో హ్యాపీ డేస్ షోలో గ్యాప్‌లో అషు రెడ్డి లంగావోణీలో ఫొటోషూట్ చేస్తున్నది చూపించాడు. అంతేకాదు, ‘ఇది సార్ అరాచకం.. ఈ ఫోజులేంటో కానీ, మేడం.. ఈ డ్రెస్ మీద కూడా ఆ ఫోజులేంటి మేడం? చెప్పొచ్చుకదరా నువ్వైనా మంచి ఫోజులు పెట్టమని' అంటూ కెమెరామెన్‌కు క్లాస్ పీకేశాడు.

  Recommended Video

  VJ Sunny Latest Speech At Mahanatulu Poster Launch | Filmibeat Telugu
  మరో దరిద్రమన్న యాంకర్ రవి

  మరో దరిద్రమన్న యాంకర్ రవి

  అంతేకాదు, యాంకర్ రవి ‘సోషల్ మీడియాలో మీ ఫొటోలకు పిచ్చ పిచ్చ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు' అని అన్నాడు. దీనికి పక్కనే ఉన్న అషు రెడ్డి అసిస్టెంట్.. ‘మీమ్స్ పెట్టాలనే కదా.. ఈ ఫొటోలు అప్‌లోడ్ చేసేది' అంటూ ఆమె బండారం బయటపెట్టేశాడు. ఆ తర్వాత అషు రెడ్డి ఫొటోలు చూస్తూ ‘మరో దరిద్రం రెడీ అయింది' అంటూ ఆమె గాలి తీసేశాడు యాంకర్ రవి.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Recently Anchor Ravi Did Shocking Comments on Her Photoshoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X