twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షన్నుతో కకనెక్షన్ పై సిరి రియాక్షన్.. ఆ వ్య‌వ‌హారం చాలా సీరియ‌స్ గా వెళుతోంది!

    |

    బిగ్ బాస్ లో పరిస్థితులను బట్టి రంగులు మార్చే విధానం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి సందర్భంలో అయినా సరే చాలా తెలివిగా ఆలోచిస్తూ అడుగులు వేయాలి. ఇక కొన్నిసార్లు స్నేహితులుగా ఉన్న వారు కూడా వెన్నుపోటు పొడవక తప్పదు. ఎంత సర్దుబాటు చేసుకున్నా కూడా పరిస్థితులు ఒక్కసారిగా మార్చేస్తాయి. ఇక ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గుతున్న కొద్దీ అలాంటి పరిణామాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్ చాలా వరకు ఊహించని విధంగా రంగులు మార్చేస్తున్నారు. ఇక సిరి, షణ్ముఖ్ కెమిస్ట్రీ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం రోజురోజుకు మరింత సీరియస్ గా మారుతోందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

    బంగారం.. కెప్టెన్సీ టాస్క్

    బంగారం.. కెప్టెన్సీ టాస్క్

    బిగ్ బాస్ మొదలై 70 రోజులు దాటింది. ఇక 11వ వారం కెప్టెన్ గా ఎవరు అవుతారు అనేది ఎంతో ఆసక్తిగా మారింది. ఇక ప్రతీ ఒక్కరు కూడా గోల్డ్ మైనర్స్ గా మారి బంగారాన్ని కాపాడుకునే టాస్క్ ల్ గట్టిగానే పోరాడారు. నీ ఇల్లు బంగారం కాను టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. బిగ్ బాస్ రోజురోజుకు టాస్క్ ల విషయంలో కాస్త డోస్ కూడా పెంచుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ వారం దాదాపు అందరి మధ్యలో ఎదో ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది.

     సిరి బంగారం షన్నుకి

    సిరి బంగారం షన్నుకి

    ఇక పోటీదారుల టాస్క్‌లో మాన‌స్ వచ్చిన గొడ్డ‌లిని తన ప్రాణ మిత్రుడు స‌న్నీ కోసం ఇచ్చేశాడు. అనంతరం బిగ్ బాస్ స‌న్నీని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి స్పెష‌ల్ ప‌వ‌ర్ ఇవ్వడంతో ఆట మరో మలుపు తిరిగింది. ఎవరి దగ్గర అయినా సరే బంగారు ముత్యాల‌ను తీసుకుని మరొకరికి ఇవ్వవచ్చు అని పవర్ ఇవ్వడంతో స‌న్నీ అనుకున్న విధంగానే సిరిని టార్గెట్ చేశాడు. ఆమె ద‌గ్గ‌ర నుంచి బంగారాన్ని తీసుకొని ష‌ణ్ముఖ్‌ జస్వంత్ కు ఇవ్వడం విశేషం. బహుశా సిరికి త్యాగం చేయాల్సిన అవసరం వస్తే షన్ను కోసం బంగారాన్ని మొత్తం ఇచ్చేదేమో. ఇక సిరి మనసుకు తగ్గట్లుగానే సన్నీ అతనికి బంగారం ఇవ్వడం విశేషం.

    మానస్ vs ప్రియాంక

    మానస్ vs ప్రియాంక

    మొద‌టి రౌండ్‌ లో అందరికంటే ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక‌, మాన‌స్‌ల ల మధ్య ఒక పోటీ కూడా పెట్టారు. వారిద్దరికీ బెలూన్ టాస్క్ ఇవ్వ‌గా అందులో పింకీ సునాయాసంగా గెలిచేసింది. తనకు ఇష్టమైన వ్యక్తితో టాస్క్ ఇవ్వడంతో పింకి కొంత అప్సెట్ అయినప్పటికీ ఆటలో భాగంగా గట్టి పోటీని ఇవ్వక తప్పలేదు. మొత్తానికి పింకి అయితే మొదటిసారి మానస్ ను చూడకుండా గేమ్ స్ట్రాంగ్ గా ఆడింది.

    Recommended Video

    RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Filmibeat Telugu
    షన్ను, సిరి.. సిరియస్ వ్యవహారం

    షన్ను, సిరి.. సిరియస్ వ్యవహారం

    ఇక అందరిది ఒకేలా ఉంటే సిరి షన్ను ట్రాక్ మరొక విధంగా మారింది. ఇద్ద‌రం ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట్ అయ్యామంటూ.. అందుకే ష‌ణ్ను ట్రిప్ అవుతున్నాడ‌ని వివరణ ఇచ్చింది. గత రాత్రి సిరి షన్ను రొమాంటిక్ ట్రాక్ ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు కూడా ఓకే బెడ్ పై పడుకోవద్దని కూడా అనుకున్నారు. ఇక వీరి కాంబినేషన్ పై కంటెస్టెంట్స్ ఇప్పటికే చాలా రకాల కామెంట్స్ చేశారీ. ఇక యాంకర్ రవి ఒక‌రినొక‌రు బాగా సీరియ‌స్‌గా తీసుకుంటున్నార‌ని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో ఆలోచించుకోండి అంటూ హితబోధ చేశాడు.

    English summary
    Anchor ravi comments on ankth Shanmukh Jaswanth and siri .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X