Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు.. నాటీ పనులంటూ అసలు గుట్టు బయటపెడుతోన్న యాంకర్ రవి
ప్రస్తుతం సెలెబ్రిటీస్ అందరూ యూట్యూబ్ మీద పడ్డారు. ప్రతీ ఒక్కరూ తమ పేరు మీదుగా యూట్యూబ్ చానెల్ పెడుతూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా సుమ, యాంకర్ రవిలు వీటిని అన్ని రకాలుగా వాడేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటి వద్ద ఉండే డబ్బుల సంపాదించాలంటే యూట్యూబ్‌ను వేడుకోవాల్సిందే. అందుకే బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు, యాంకర్స్‌లో రవి, సుమ వంటి యూట్యూబ్ చానెల్స్ పెట్టేశారు.
బిజినెస్ కూడా చేసేస్తున్నారు..
ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రోహిణి, శివజ్యోతి, హిమజ వంటి వారు యూట్యూబ్ చానెల్స్ పెట్టి అందులో ఆడవారి ఫ్యాషన్ వస్తువులు పెడుతూ, వాటిని ప్రమోట్ చేస్తూ భలే బిజినెస్ చేసేస్తున్నారు. ఇలా వారికి ఇంటి వద్ద నుంచే ఆదాయం సమకూరుతూ ఉంటుంది.
యాంకర్స్ అలా..
ఇక యాంకర్స్ వేరేలా డబ్బులు సంపాదిస్తున్నారు. సెలెబ్రిటీలను లైవ్‌లోకి తీసుకొచ్చి, ఫన్ క్రియేట్ చేయడం, వారితో ముచ్చట్లు పెట్టడం వంటివి చేస్తూ తమ యూట్యూబ్ చానెల్‌కు క్రేజ్ పెంచుకుంటున్నారు. యాంకర్ రవి, సుమ ఇలా యూట్యూబ్‌లోనూ దూసుకుపోతున్నారు. యాంకర్ రవి ఇంకాస్త ముందుకు స్పెషల్ స్కిట్స్, ప్రోగ్రామ్స్ డిజైన్స్ చేస్తున్నాడు.
యాంకర్ రవి ఫుల్ బిజీ..
బుల్లితెరపై యాంకర్ రవి ఎంత బిజీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే నువ్వు రెడీ నేను రెడీ అనే కొత్త షోకు హోస్టింగ్ చేస్తున్నాడు. వింధ్యతో కలిసి చేస్తోన్న ఈ షో సక్సెస్ అవ్వడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. మరోవైపు అదిరింది షోతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు. ఇక తాజాగా రవి తన యూట్యూబ్ ఛానెల్ గురించి ఓ విషయాన్ని షేర్ చేశాడు.
యూట్యూబ్‌లో కొత్త ప్రోగ్రాం..
రవి తన యూట్యూబ్ చానెల్లో కొత్త ప్రోగ్రాంను రిలీజ్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అంటూ ఏవో కొంటె పనులు చేసేవాడిలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. నా యూట్యూబ్ చానెల్లో కొంత నాటినెస్ మీ ముందుకు వస్తోంది.. చూడండి అంటూ అప్డేట్ ఇచ్చాడు. మరి ఇందులో ఏం చెప్పనున్నాడో చూడాలి.