షోలో యాంకర్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు: అలాంటి మాటలతో రచ్చ.. బరితెగించావ్‌రా అంటూ బ్రహ్మానందం!

బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోన్న తరుణంలోనూ.. దాదాపు పదేళ్లుగా తన హవాను చూపిస్తూ స్టార్ హోస్టుగా పేరు సంపాదించుకున్నాడు రవి. తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలా చాలా కాలంగా తన మార్కును చూపిస్తూ బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోన్నాడు. కెరీర్ పరంగా ఎంత పాపులర్ అయ్యాడో.. తన వివాదాస్పద తీరుతో అంతే రీతిలో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ షోలో అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అప్పటి నుంచి అతడే.. అన్నింట్లోనూ కనిపిస్తూ

అప్పటి నుంచి అతడే.. అన్నింట్లోనూ కనిపిస్తూ

దాదాపు పదేళ్ల క్రితమే బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రవి. సుదీర్ఘమైన కెరీర్‌లో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి పదుల సంఖ్యలో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో ఆఫర్లతో బిజీ బిజీగా గడిపాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్ల డామినేషన్‌ను తట్టుకుని నిలబడ్డాడు.

రవి కెరీర్‌లో అది చాలా ప్రత్యేకం.. పాపులారిటీ

రవి కెరీర్‌లో అది చాలా ప్రత్యేకం.. పాపులారిటీ

ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే స్టాండప్ కామెడీ షో 'పటాస్'కు రవి హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల రవికి మంచి పేరు రావడంతో పాటు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా మరో యాంకర్ శ్రీముఖితో కలిసి చేసిన కొన్ని ఎపిసోడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తర్వాత దీనికి బైబై చెప్పాడతను.

వివాదాలతో సాహవాసం.. అప్పుడు విమర్శలు

వివాదాలతో సాహవాసం.. అప్పుడు విమర్శలు

యాంకర్ రవికి వివాదాలు కొత్త కాదు. అతడి కెరీర్‌లో చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. వీటిలో ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగలేదు. చాలా రోజుల తర్వాత దీనికి పుల్‌స్టాప్ పడింది.

కెరీర్‌లో ఒక్కటే.. ‘ప్రేమకథ' వల్ల స్టేషన్ వరకూ

కెరీర్‌లో ఒక్కటే.. ‘ప్రేమకథ' వల్ల స్టేషన్ వరకూ

కొద్ది రోజుల క్రితం యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కామెడీ స్టార్స్ కోసం.. ఆమెతో కలిసొచ్చిన రవి

కామెడీ స్టార్స్ కోసం.. ఆమెతో కలిసొచ్చిన రవి

'కామెడీ స్టార్స్' అనే షో స్టార్ మాలో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. చమ్మక్ చంద్ర, అవినాష్, హరితో పాటు హాట్ బ్యూటీలు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. దీనికి మరో యాంకర్ లాస్య మంజునాథ్‌తో కలిసి వచ్చాడు రవి.

షోలో యాంకర్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు

షోలో యాంకర్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు

తాజాగా జరిగిన 'కామెడీ స్టార్స్' ఎపిసోడ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ గెస్టుగా వచ్చాడు. ఎప్పటి లాగే ఈ షోలోనూ ఆయన తనదైన మార్క్ కామెడీతో పాటు పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వాళ్లలో ఎనిమిది మందిని నాలుగు జంటలుగా చేసిన ఆయన.. వాళ్లతో పానీపూరీ గేమ్ ఆడించాడు. ఈ సమయంలో రవి వల్గర్ కామెంట్స్ చేశాడు.

ఆ మాట అనగానే.. బరితెగించావ్‌రా అంటూ

ఆ మాట అనగానే.. బరితెగించావ్‌రా అంటూ

బాబా భాస్కర్ ఈ గేమ్ గురించి వివరిస్తూ.. మొత్తం మింగిన తరువాతే ఇంకోటి నోట్లో పెట్టుకోవాలని చెప్పాడు. అప్పుడే 'మింగాలి' అన్న పదాన్ని హైలైట్ చేశాడు శేఖర్ మాస్టర్. ఆ సమయంలోనే కలుగజేసుకున్న యాంకర్ రవి.. 'మీరు మమ్మల్ని మింగకండి సార్' అంటూ వల్గర్ కామెంట్ చేశాడు. ఆ డైలాగ్‌కి వెనుక నుంచి 'బాగా తెగించావ్ రా నువ్వూ' అనే బ్రహ్మానందం డైలాగ్‌ను వాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X