Bigg Boss: సన్నీ చేతిలో ఆ ఇద్దరి భవిష్యత్.. వద్దని చెప్పినా వినకుండా.. ఎలిమినేషన్ వెనుక జరిగిందిదే!

సరికొత్త టాస్కులు.. మధ్య మధ్యలో ఊహించని సంఘటనలు.. వారం చివర్లో ఎమోషనల్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో రకాలుగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగులో ప్రసారం అయ్యే షోకు మాత్రమే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ జోష్‌లోనే సీజన్ల మీద సీజన్లు పూర్తి చేస్తున్నారు నిర్వహకులు. ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో రసకందాయంగా సాగుతోంది. దీంతో షోలో ఎన్నో ములుపులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 12వ వారం జరగనున్న ఎలిమినేషన్‌ సంచలనంగా మారిందని తెలిసింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియను డిసైడ్ చేసింది మరో కంటెస్టెంట్ సన్నీనేనట. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

చివరి దశలో మరింత ఆసక్తికరంగా

చివరి దశలో మరింత ఆసక్తికరంగా

ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటూ బిగ్ బాస్ ఐదో సీజన్‌పై అంచనాలను భారీ స్థాయిలో పెంచేశారు నిర్వహకులు. అందుకు అనుగుణంగానే ఆరంభంలోనే 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. అలాగే, తరచూ భిన్నమైన టాస్కులు ఇస్తూ షోను రక్తి కట్టించారు. ఈ క్రమంలోనే ఎక్కువగా గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ ప్రేక్షకులందరికీ మజాను పంచారు. ఇక, ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితంగా కొద్ది రోజులుగా ఇది ఆసక్తికరంగా సాగుతోంది.

ఇప్పటి వరకూ వాళ్లంతా బయటకు

ఇప్పటి వరకూ వాళ్లంతా బయటకు

తాజాగా ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 11 వారాలకు పదకొండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ ఎలిమినేట్ అయిపోయారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.

 ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు

ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు

12వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ మొత్తం గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా ప్రియాంక, సిరి.. కాజల్, రవి, సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక, ఈ వారంలో కెప్టెన్ మానస్ మినహా మిగిలిన కంటెస్టెంట్లు ఆర్జే కాజల్, సిరి హన్మంత్, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రేక్షకులంతా తమకు తోచిన విధంగా అంచనాలు వేసుకుంటున్నారు.

ముగ్గురు సేఫ్.. నలుగురు జోన్‌లోనే

ముగ్గురు సేఫ్.. నలుగురు జోన్‌లోనే

12వ వారానికి సంబంధించి మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో నిన్న అంటే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆయా కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీలు, ఫ్రెండ్‌ ద్వారా ముందుగా సన్నీ, తర్వాత శ్రీరామ చంద్ర, చివర్లో సిరి హన్మంత్‌లు సేఫ్ అయ్యారు. అంటే మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్‌లు మాత్రం డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. వీళ్ల నుంచి ఒకరు ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అవుతారు. యాంకర్ రవి బయటకు వెళ్లినట్లు ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రోమోతో అసలు విషయం రివీల్

ప్రోమోతో అసలు విషయం రివీల్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది యాంకర్ రవినే అని నిన్నటి నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా స్టార్ మా ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో యాంకర్ రవి, ఆర్జే కాజల్ చివరి దశకు చేరినట్లు చూపించారు. అంటే వీళ్లిద్దరికి మాత్రమే అందరి కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయని షో నిర్వహకులు పరోక్షంగా తెలిపారు. వీళ్లలో నుంచే ఒకరిని బయటకు పంపుతున్నారని ప్రోమో చూసిన తర్వాత అర్థం అవుతోంది. దీంతో కొంతలో కొంతైన రవి ఎలిమినేషన్ అబద్ధం అవుతుందని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు షాక్ తగిలినట్లైంది.

సన్నీ చేతిలో వాళ్లిద్దరి భవిష్యత్

12వ వారానికి సంబంధించి యాంకర్ రవి, ఆర్జే కాజల్‌కు మాత్రమే చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు నాగార్జున తెలిపాడు. దీంతో ఇద్దరినీ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుండల కింద నిల్చోబెట్టాడు. అలాగే, ఇద్దరికీ చెరో కర్రను ఇచ్చాడు. అదే సమయంలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకున్న సన్నీకి మాత్రమే వీళ్లిద్దరి నుంచి ఒకరిని సేఫ్ చేసే అధికారం ఉందని చెప్పాడు. 'ప్రేక్షకుల తీర్పు నా దగ్గర ఉంది. కానీ, ఆ జడ్జ్‌మెంట్‌ను మార్చే కెపాసిటీ మీలో ఒక్కరికే ఉంది' అంటూ సన్నీ దగ్గర ఉన్న పాస్‌ గురించి గుర్తు చేశాడు.

Recommended Video

Jeethu Joseph About Screen Writing | Drushyam 2
 వద్దని చెబుతున్నా వినని సన్నీ

వద్దని చెబుతున్నా వినని సన్నీ

నాగార్జున సూచన మేరకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్'ను తీసుకుని వస్తాడు సన్నీ. అప్పుడు నాగార్జున 'ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటున్నావా? ఇప్పుడు వీళ్లిద్దరిలో ఒకరిని సేఫ్ చేయాలని అనుకుంటున్నావా' అంటూ సన్నీని ప్రశ్నించాడు. దీంతో అతడు చాలా సేపు ప్రెజర్‌కు గురైనట్లు కనిపించాడు. ఆ సమయంలోనే వెనుక ఉన్న షణ్ముఖ్ జస్వంత్ 'అన్నీ ఆలోచించుకో సన్నీ' అంటూ చెప్పాడు. దీంతో ఈ ప్రోమోను సస్పెన్స్‌తో కట్ చేశారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. సన్నీ పాస్‌ను కాజల్ కోసం వాడడట. దీంతో రవి ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X