Bigg Boss Telugu 5: హౌస్‌లోకి అడుగు పెట్టిన రవి.. బిగ్ బాస్ ఆఫర్.. పెళ్లి గురించి నాగ్ ప్రశ్న
తెలుగులోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి వచ్చిన దీనికి.. ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కారణంగానే ఇది విజయవంతంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఐదో సీజన్ నేడు (సెప్టెంబర్ 5) ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ప్రముఖ యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడికి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ గురించి తెలుసుకుందాం పదండి!

మరింత ఎక్కువగా ఐదో సీజన్ మార్చి
ఆదివారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్, ఐదింతల డ్రామా, ఐదింతల ఎనర్జీ ఉండబోతుందని నిర్వహకులు వెల్లడించారు. అంతేకాదు, షో జరిగే తీరులో కూడా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్‌ను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దారు.

అంగరంగ వైభవంగా మొదలైన సీజన్
బిగ్ బాస్ ప్రియులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అనుమానాల నడుమ ఐదో సీజన్‌ను ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

ఈ సారి అలాంటి వాళ్లే కంటెస్టెంట్లుగా
బిగ్ బాస్ షో అంటే ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్‌లో ఉండి వచ్చారు.

బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన రవి
తెలుగు బుల్లితెరపై దాదాపు పదేళ్లుగా తన హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్న రవి కూడా ఈ సారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇప్పుడు యాంకర్ రవి బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్‌పై అతడు 'మారి' సాంగ్‌కు డ్యాన్స్ కూడా చేశాడు.

టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా రవి ఎంట్రీ
యాంకర్ రవికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడు బిగ్ బాస్ ఐదో సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్లు అందరిలోనూ టైటిల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే, బిగ్ బాస్ షోలో ఫాలోయింగ్ కంటే నిజాయితీకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి రవి ఎలా ఆడతాడో అన్న ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. అతడు 19వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్ రవికి ఇచ్చిన ఆఫర్ ఇదేనా
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తోన్న యాంకర్లలో రవి ఒకడు. ఏకకాలంలో అతడు ఎన్నో షోలు, ఈవెంట్లు చేస్తుంటాడు. అతడి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే బిగ్ బాస్ నిర్వహకులు షోలో పాల్గొనేందుకు గానూ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యాంకర్ రవి రోజుకు లక్ష రూపాయల వరకూ చార్జ్ చేస్తున్నాడని తెలిసింది.
Recommended Video

రవికి నాగార్జున సర్‌ప్రైజ్.. పెళ్లి గురించి
19వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవిని నాగార్జున పెళ్లి గురించి ప్రశ్నించాడు. తనకెందుకు చెప్పలేదని అడిగాడు. దీంతో రవి ఆయనకు సారీ చెప్పాడు. ఆ తర్వాత నాగ్ అతడికి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అందులో రవి కూతురు ఓ డాల్‌ను పంపించడంతో పాటు ఓ వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత లోపల అసలు కథ చూపిస్తా అంటూ ఈ యాంకర్ ఎంట్రీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











