అషు రెడ్డిని అక్కడ పట్టుకుని ఇబ్బంది పెట్టిన రవి: అందరి ముందే అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది

అషు రెడ్డి.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ అమ్మడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు వ్యక్తిగతంగానూ ఏదో ఒక పని చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో విచిత్రమైన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఎన్నో షోలలో భాగం అవుతోన్న ఈ బ్యూటీ.. లవ్ ట్రాకును కూడా నడుపుతూ యమ పాపులర్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ రవి ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆ వెంటనే అషు రెడ్డి అతడి అందరి ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ సంగతులు మీకోసం!

హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్

 జూనియర్ సమంతలా పాపులర్ అయింది

జూనియర్ సమంతలా పాపులర్ అయింది

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. జూనియర్ సమంతలా పేరు సంపాదించుకుంది. అచ్చం ఆమెలాగే కనిపించడంతో విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంది. ఆ దెబ్బతో హైలైట్ అయిన ఈ భామ.. నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్‌గా ఛాన్స్ పట్టేసింది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ హాట్ టాపిక్

ఎప్పుడూ అందులోనే ఉంటూ హాట్ టాపిక్

అషు రెడ్డి సినిమాలో నటించినా.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నా అదంతా సోషల్ మీడియా వల్లనే అన్న విషయం తెలిసిందే. అంతలా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తోంది. గ్లామర్‌గా కనిపించడంతో పాటు మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును తన ప్రైవేటు పార్టులో టాటూగా వేయించుకుని చూపించింది. అప్పటి నుంచి అలా గుర్తింపు దక్కించుకుందామె.

 వాళ్లతో కలిసి ‘కామెడీ స్టార్స్' అని వచ్చింది

వాళ్లతో కలిసి ‘కామెడీ స్టార్స్' అని వచ్చింది

స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

ఆ కమెడియన్‌తో రొమాన్స్.. లవ్ ట్రాక్ వల్ల

ఆ కమెడియన్‌తో రొమాన్స్.. లవ్ ట్రాక్ వల్ల


అషు రెడ్డి కామెడీ స్టార్స్‌లో ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించింది.

ప్రేమాయణంపై క్లారిటీ.. ఏకంగా అంత మాట

ప్రేమాయణంపై క్లారిటీ.. ఏకంగా అంత మాట


అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. అతడితో ఉన్న రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.

బాలిక అంటే సుందరితో పాటు ఆమె కూడా


వచ్చే వారం ప్రసారం కానున్న 'కామెడీ స్టార్స్' షోలో లాస్య అతిలోక సుందరి పాత్రను పోషించింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి అమ్రెష్ పురిలా నటించాడు. ఈ స్కిట్‌లో భాగంగా అతడు 'రా బాలిక' అంటూ మంత్రాలు పెట్టినట్లు నటించాడు. దీంతో అతిలోక సుందరి లాస్యతో పాటు అషు కూడా వచ్చింది. అప్పుడు 'రా బాలిక అంటే నీ బాలికొచ్చింది' అని శేఖర్ మాస్టర్ కామెంట్ చేశాడు.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
అషును అక్కడ పట్టుకుని ఇబ్బంది పెట్టిన రవి

అషును అక్కడ పట్టుకుని ఇబ్బంది పెట్టిన రవి

హరి వెళ్లిపోమనగానే 'మళ్లీ రమ్మన్నావంటే అప్పుడు చెప్తా' అంటూ అందరి ముందే అతడికి వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలోనే స్కిట్లో భాగంగానే యాంకర్ రవి వచ్చి ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు హరి వదిలి పెట్టమని అడిగినా అతడు వదల్లేదు. ఆ తర్వాత అషు రెడ్డి కింద పడిపోయింది. మొత్తానికి ఈ స్కిట్ ఫన్‌తో పాటు ఫ్రస్టేషన్‌గానూ సాగినట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X