ఆడవాళ్లు చీర లేపి అది కనిపించేలా కట్టుకోవాలి: బిగ్ బాస్ బ్యూటీతో యాంకర్ రవి ఘాటు వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై దాదాపు పదేళ్లుగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యాంకర్ రవి. ఒకవైపు లేడీ యాంకర్ల హవా కనిపిస్తున్నా.. చేతి నిండా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. వరుసగా ఆఫర్లు అందుకోవడంతో పాటు పలు ఈవెంట్లలోనూ మెరుస్తున్నాడు. యాంకర్‌గా ఎంతో సక్సెస్ అయినప్పటికీ.. తన వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న అతడు.. తాజాగా ఓ షోలో ఆడవారి చీరకట్టు గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఎప్పుడో వచ్చాడు.. ఎన్నో షోలలో మెరిశాడు

ఎప్పుడో వచ్చాడు.. ఎన్నో షోలలో మెరిశాడు

దాదాపు పదేళ్ల క్రితమే బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రవి. సుదీర్ఘమైన కెరీర్‌లో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి పదుల సంఖ్యలో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో ఆఫర్లతో బిజీ బిజీగా గడిపాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్ల డామినేషన్‌ను తట్టుకుని నిలబడ్డాడు.

అదొక్కటే.. యాంకర్ రవిని హైలైట్ చేసేసింది

అదొక్కటే.. యాంకర్ రవిని హైలైట్ చేసేసింది

ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే స్టాండప్ కామెడీ షో 'పటాస్'కు రవి హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల రవికి మంచి పేరు రావడంతో పాటు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా మరో యాంకర్ శ్రీముఖితో కలిసి చేసిన కొన్ని ఎపిసోడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తర్వాత దీనికి బైబై చెప్పాడతను.

ఎన్నో వివాదాలు.. ఆ సమయంలో విమర్శలు

ఎన్నో వివాదాలు.. ఆ సమయంలో విమర్శలు

యాంకర్ రవికి వివాదాలు కొత్త కాదు. అతడి కెరీర్‌లో చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. వీటిలో ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగలేదు. చాలా రోజుల తర్వాత దీనికి పుల్‌స్టాప్ పడింది.

ఒకే ఒక్క ప్రేమకథ.. పోలీస్ స్టేషన్‌కు యాంకర్

ఒకే ఒక్క ప్రేమకథ.. పోలీస్ స్టేషన్‌కు యాంకర్

కొద్ది రోజుల క్రితం యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కంటెస్టెంట్‌తో యాంకర్ రవి ఘాటు వ్యాఖ్యలు

కంటెస్టెంట్‌తో యాంకర్ రవి ఘాటు వ్యాఖ్యలు

యాంకర్ రవి ప్రస్తుతం 'ఛల్‌మార్' అనే షో చేస్తున్నాడు. యూట్యూబ్‌లో వచ్చే ఇందులో అతడితో పాటు బిగ్ బాస్ ఫేం, ప్రముఖ నటి హిమజ కూడా హోస్టుగా చేస్తోంది. ఈ షోకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో జబర్ధస్త్ ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్, దొరబాబు, సుధాకర్ తదితరులు గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ రవి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఆడవాళ్లు చీర లేపి అది కనిపించేలా కట్టుకోవాలి

ఆడవాళ్లు చీర లేపి అది కనిపించేలా కట్టుకోవాలి

ఈ షో ఇంట్రడక్షన్‌లో హిమజ 'నాకు నీలా మాస్ చేయడం రాదు' అని రవితో అంటుంది. దీనికి 'ఆడవాళ్లు మాస్ అంటే ఏమీ లేదు. చీరలోనూ మాస్ చూపించొచ్చు. దాన్ని కొంచెం పైకి లేపి కట్టాలి. అలాగే, బొడ్డు కనిపించేలా మేనేజ్ చేయాలి. అలా చేస్తే మాస్ అయిపోతోంది' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో షాకైన హిమజ నోరెళ్లబెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Recommended Video

Krack Movie First Day Collections | Raviteja మేనియా అంటే ఇదీ !

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X