ఫ్రెండ్ లవర్‌ను పెళ్లి చేసుకున్నా.. ఆ సమయంలో వదిలేస్తా అనుకుంది: రవి షాకింగ్ కామెంట్స్

Recommended Video

Anchor Ravi Intresting Comments On His Wife Nithya || Filmibeat Telugu

యాంకర్ రవి.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి.. వెండితెర పైనా మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఇక, తాజాగా రవి.. తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పటాస్ షోతో ప్రత్యేక గుర్తింపు

పటాస్ షోతో ప్రత్యేక గుర్తింపు

బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్‌లలో ‘పటాస్' ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్‌కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో పాపులర్ అవ్వడానికి రవి కూడా మెయిన్ రీజన్ అంటారు. ఇందులో రవి చేసే సందడి అంతా ఇంతా ఉండదు. అందుకే అతడికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

 వివాదాలు కూడా చుట్టుముట్టాయి

వివాదాలు కూడా చుట్టుముట్టాయి

యాంకర్ రవికి ఎంత మంచి పేరు వచ్చిందో.. అంత కంటే ఎక్కువ స్థాయిలోనే వివాదాలూ చుట్టుముట్టాయి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని, చివాట్లు తిని మళ్ళీ క్షమాపణలు కోరాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో జరిగిన సంఘటన అతడి కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయింది. ఇలా చాలా వివాదాల కారణంగానూ రవి హాట్ టాపిక్ అయ్యాడు.

ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు

ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు

ప్రతీ పండగకు బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రోజా, నాగబాబు గొడవ పడడాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. వీరిలో ఏ టీమ్ వాళ్లు గెలిస్తే వాళ్లే తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. ఇలా గతంలోనూ పలు కార్యక్రమాలు వచ్చాయి.

 ఫ్రెండ్ లవ్ చేస్తే నేను పెళ్లి చేసుకున్నా

ఫ్రెండ్ లవ్ చేస్తే నేను పెళ్లి చేసుకున్నా

‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' ప్రోగ్రాంకు రవి తన ఫ్యామిలీతో సహా వచ్చాడు. ఈ సందర్భంగా రవి తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘చదువుకునే రోజుల్లో నిత్య (భార్య)ను మా ఫ్రెండ్ లవ్ చేసేవాడు. వాళ్లిద్దరి మధ్యలో నేను మీడియేటర్‌గా చేసేవాడిని. వాడికి హెల్ప్ చేయడానికి వెళ్లి నేను పెళ్లి చేసుకున్నా. ఎనిమిదేళ్లు లవ్ తర్వాత పెళ్లి అయింది. మా వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అవుతుంది' అని చెప్పాడు.

వదిలేస్తా అనుకున్నారు

వదిలేస్తా అనుకున్నారు

అలాగే, తన కూతురి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు రవి. ‘నాకు అమ్మాయే పుట్టాలని ఎంతో కోరుకునే వాడిని. పెద్దవాళ్లు దీవించేటప్పుడు పుత్ర ప్రాప్తిరస్తు అని ఎవరైనా అంటే.. వెంటనే మళ్లీ కాళ్లపై పడి సుపుత్రి ప్రాప్తిరస్తు అనండి అనేవాడిని. ఒకానొక టైమ్‌లో కొడుకు పుడితే నేను వదిలేస్తానేమో అని నిత్యతో పాటు మా వాళ్లు అందరూ అనుకున్నారు' అని అతడు వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X