For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి 'అడవి పంది' అంటూ యాంకర్ రవి పోస్ట్.. అషు రెడ్డి షాకింగ్ రియాక్షన్!

  |

  యాంకర్ రవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆయన వివిధ రకాల షోలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా రవి లాస్య జోడి అలాగే రవి శ్రీముఖి జోడి అంటే ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య ఆయన లాస్యతో కలిసి మళ్ళీ షోలు చేయడం మొదలు పెట్టాడు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా రవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆషూ రెడ్డి వీడియో ఒకదానిని షేర్ చేశారు. అడవి పంది అంటూ కామెంట్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  అమెరికాలో పుట్టినా

  అమెరికాలో పుట్టినా


  యాంకర్ రవి గురించి అందరికీ తెలుసు. ఇక అషూ రెడ్డి టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన తెలుగు దంపతులకు జన్మించింది. దీంతో ఆమె అమెరికన్ నేషనాలిటీ కలిగి ఉంది. అలా యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత, ఆమె డల్లాస్ నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి ఆమె నటన మరియు సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కలిగి ఉండేది.

  నటన మీద మక్కువతో

  నటన మీద మక్కువతో

  అందుకే ఆమె సినిమా రంగం మీద వైపు మొగ్గు చూపింది. అలా ఆమె సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఇండియా చేరింది. అయితే ఆమె బాగా ఫేమస్ అయింది మాత్రం జూనియర్ సమంత అనే. డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ముందుగా ఆమె జూనియర్ సమంత అనే క్రేజ్ తో నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి మెప్పించింది.

  బిగ్ బాస్ తో మంచి క్రేజ్

  బిగ్ బాస్ తో మంచి క్రేజ్

  ఆ పాత్ర ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కంటెస్టెంట్ గా రచ్చ చేసింది. బిగ్ బాస్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే ఒక ప్రోగ్రాం లో ఆమె ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి స్కిట్స్ చేస్తోంది. అంతేకాక హ్యాపీ డేస్ అనే ఒక షోను కూడా హోస్ట్ చేస్తోంది.

  అషు అడవి పంది అంటూ

  అషు అడవి పంది అంటూ

  హ్యాపీ డేస్ షోలో ఆషూ రవి ఇద్దరూ కలిసి హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షో షూట్ కోసం వెళ్లిన సమయంలో అషూ రెడ్డిని ఒక వీడియో తీశారు రవి. దానికి జనారణ్యంలోకి వచ్చిన ఓ అడవిపంది పార్కులో కలకలం సృష్టించింది., వనస్థలిపురం సాహెబ్‌నగర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవి పందిని తరమడంతో అది సచివాలయనగర్‌లోని హుడా పార్కులో దూరిందని అంటూ 2016 న్యూస్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్నట్టు చూపించారు.

  రవి నువ్వు దొరక్క పోవు

  రవి నువ్వు దొరక్క పోవు

  దీనికి అషు స్పందిస్తూ రవి నువ్వు దొరక్క పోవు, నీ సంగతి చూస్తానంటూ కామెంట్ చేసింది. ఇక ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఇక రవి కూడా ప్రస్తుతం చేతి నిండా రకరకాల షోలతో బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఆ ప్రయోగాలు పక్కన పెట్టి పూర్తిగా షోల మీద ఫోకస్ పెట్టాడు.

  English summary
  Telugu popular anchor Ravi shares a video of Bigg Boss season 3 fame Ashu Reddy is doing rounds on social media and generating hilarious fun.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X