రోజాకు చెక్.. అనసూయతో జతకట్టిన నాగబాబు.. యాంకర్ రవి భలే స్కెచ్ వేశాడే!
లాక్‌డౌన్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న సెలబ్రిటీలు టెక్నాలజీని ఉపయోగించుకొంటూ తమ ప్రతిభను చాటుకొంటున్నారు. వాట్సప్, జూమ్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ల ఆసరాతో లైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సరికొత్త ఆలోచలు, అభిరుచితో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. పటాస్, అదిరింది లాంటి క్రేజీ షోలతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న యాంకర్ రవి కొత్త షోను ఆరంభించారు. ఆ కార్యక్రమంలో నాగబాబు, అనసూయను జత కలిపి క్రేజీగా మార్చారు. ఇంతకు ఆ షో ఏమిటంటే..

క్వారంటైన్ లైఫ్‌లో యాంకర్ రవి
క్వారంటైన్ లైఫ్‌లో ఉంటున్న యాంకర్ రవి తన సృజనాత్మకతకు పదును పెట్టారు. లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి అనే చాట్ షోను ప్రారంభించారు. తాజా ఎపిసోడ్‌లో మెగా బ్రదర్ నాగబాబు, అందాల భామ అనసూయ భరద్వాజ్‌ను వారిద్దరితో ముచ్చట్లు పెట్టారు. ఈ కార్యక్రమం ఈ వారంతం అంటే శని, ఆదివారాల్లో 8.30 గంటలకు జీ తెలుగులో లైవ్ కానున్నది.

రోజాతో కాకుండా అనసూయతో
సాధారణంగా ఏదైనా షోలో రోజా లేకుండా నాగబాబును చూడలేం. జబర్దస్త్‌లో వారిద్దరు ప్రేక్షకులపై అంత ప్రభావాన్ని చూపించారు. తాజాగా రవి ప్రారంభించిన షోలో నాగబాబుతో అనసూయను కలిపి ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చారు. నాగబాబుతో పాటు రోజాను ఆహ్వానించకుండా అనసూయను పిలవడం చర్చనీయాంశమైంది.

అల్లరి అల్లరిగా షో
తాజాగా లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి కార్యక్రమానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసి ఆకట్టుకొన్నారు. నాగబాబు, అనసూయ కలయికతో షో అల్లరిగా, సరదాగా మారిపోయినట్టు కనిపిస్తున్నది. రవి అడిగిన కొన్ని ప్రశ్నలకు చిలిపిగా జవాబు ఇచ్చి హోస్ట్‌ను ఇరుకున పెట్టినట్టు తెలుస్తున్నది.

చిలిపి ప్రశ్నలతో అనసూయను ఆటపట్టించి..
ఇక లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి షోలో అనసూయను బ్రహ్మండంగా ఆట పట్టించినట్టు కనిపించింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా చిలిపి ప్రశ్నలు, కామెంట్లతో అనసూయను నాగబాబు, యాంకర్ రవి ఆటాడుకొన్నట్టు కనిపించింది. టీజర్ చూస్తే బ్రహ్మండమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందనే ఫీలింగ్ కలిగింది.

నాగబాబు, నవదీప్‌తో
లాక్‌డౌన్‌కు ముందు అదిరింది అనే కామెడీ షోలో యాంకర్ రవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోలో నాగబాబు, నవదీప్‌తో కలిసి కుమ్మేస్తున్న రవి.. తాజాగా లాక్‌డౌన్ షోను కూడా అంతే మొత్తంలో వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. ఈ షోకు రానున్న రోజుల్లో మరింత ఆదరణ లభించే అవకాశం కనిపిస్తున్నది.
Recommended Video

లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి ఖుష్బూ
ఇక లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి షోకు యాంకర్ భాను శ్రీ, ధన్‌రాజ్, వేణు లాంటి వారితో ఆరంభించారు. ఆ తర్వాత సుమ కనకాల, కుష్బూ సుందర్ లాంటి ప్రముఖులను ఆహ్వానించారు. రవి బాటలోనే మరికొందరు లాక్‌డౌన్ షోను మొదలు పెట్టారు. యాంకర్ ఝాన్సీ లవ్ యూ జిందగీ అనే క్వారంటైన్ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











