ఈ సారి వేరే లెవెల్ అంటూ పోస్ట్.. బుల్లెట్ మీద లాస్యతో చక్కర్లు కొడుతున్న రవి
పండుగలు వస్తున్నాయంటే చాలు బుల్లితెర అలెర్ట్ అవుతుంది. స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంటారు. అలా స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు చానెళ్లు సెలెబ్రిటీలను పట్టుకొచ్చి అందరికీ ఎంటర్టైన్ ఇస్తుంటారు. అలా ఈ సారి ఉగాదికి మాత్రం స్టార్ మాలో రవి లాస్య సందడి చేయబోతోన్నారట. ఈ విషయాన్ని రవి స్వయంగా ప్రకటించేశాడు.

సంక్రాంతి నుంచి..
మామూలుగా రవి లాస్య జోడికి ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. మధ్యలో ఐదేళ్లు ఇద్దరూ దూరంగా ఉన్నారు. అలా చివరకు ఈ ఏడాది సంక్రాంతి ఈవెంట్ ద్వారా ఒక్కటయ్యారు. కెరీర్ మొదలుపెట్టిన మా టీవీలోనే మళ్లీ ఒక్కటయ్యారు. అలా సంక్రాంతి ఈవెంట్‌ను ఇద్దరూ కలిసి చేసేశారు.

కామెడీ స్టార్స్..
కామెడీ స్టార్స్ షోలో రవి లాస్య ఎంతలా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తెర మీద మళ్లీ నాటి రొమాన్స్‌ను పండిస్తున్నారు. రవి లాస్య అంటే ఇది అని మళ్లీ ఇప్పుడు చూపిస్తున్నారు. ఇద్దరూ కలిసి చేస్తోన్న స్పూప్‌లు బాగానే క్లిక్ అవుతున్నాయి.

ఇక స్పెషల్ ఈవెంట్లు..
అలా కామెడీ స్టార్స్ అనే కాకుండా స్పెషల్ ఈవెంట్లను కూడా తమ ఖాతాల్లోనే వేసేందుకు మంచి స్కెచ్ వేసినట్టున్నారు. రవి లాస్య ఇప్పుడు మళ్లీ ఫాంలోకి రావడంతో వీరి చేతుల్లో మంచి ఈవెంట్లు పడుతున్నట్టున్నాయి. ఇప్పటికే హోలీ ఈవెంట్ల హడావిడి అయిపోయింది. ఇక ఉగాది కోసం అందరూ రెడీ అవుతున్నారు.

ప్రోమోలతో రచ్చ..
ఆల్రెడీ ఉగాది స్పెషల్‌గా ఈటీవీ వాళ్లు ఉగాది జాతిరత్నాలు అనే షోను ప్లాన్ చేశారు. ఇందులో నానిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఇక స్టార్ మా ప్రోమోలతో హైప్ పెంచుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో రవి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వచ్చేస్తున్నాం.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మేరకు లాస్యను బుల్లెట్ ఎక్కించుకుని తిప్పుతున్న ఫోటోను రవి షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











