India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌కు యాంకర్ రవి లిప్‌ కిస్: ఛాన్స్ తీసుకోవడమే కాదు.. ఎవరైతే ఏంటి అయిపోయిందిగా అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లేడీ యాంకర్లు హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తన సత్తాను నిరూపించుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు టాలెంటెడ్ యాంకర్ రవి. అద్భుతమైన టాలెంట్‌తో వరుస అవకాశాలను అందుకుంటూ సాగిపోతున్నాడు. అదే సమయంలో విచిత్రమైన వ్యవహార శైలితో వివాదాల్లోనూ చిక్కుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో యాంకర్ రవి.. హీరోయిన్‌కు లిప్ కిస్ అంటూ రచ్చ చేశాడు. ఆ వెంటనే అతడికి భారీ షాక్ తగిలింది. ఆ సంగతులు మీకోసం!

  అప్పటి నుంచే హవా చూపిస్తున్నాడు

  అప్పటి నుంచే హవా చూపిస్తున్నాడు

  చాలా ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రవి. సుదీర్ఘమైన కెరీర్‌లో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి పదుల సంఖ్యలో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో ఆఫర్లతో బిజీగా మారాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్ల డామినేషన్‌ను తట్టుకుని ముందుకు సాగుతున్నాడు.

   లాస్యతో కలిసి రచ్చ రచ్చ చేస్తోన్న రవి

  లాస్యతో కలిసి రచ్చ రచ్చ చేస్తోన్న రవి

  స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. చమ్మక్ చంద్ర, అవినాష్, హరితో పాటు అమ్మాయిలు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇందులో లాస్య మంజునాథ్‌తో కలిసి సందడి చేస్తున్నాడు రవి.

   ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగులతో

  ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగులతో


  యాంకర్ రవి కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయినప్పటికీ.. వ్యవహార శైలితో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అతడు పాల్గొనే ప్రతి షోలోనూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడడమే ఇందుకు ప్రధానమైన కారణం. ఎవరో ఒకరిపై ఏదో రకంగా కామెంట్లు చేస్తుండే రవి.. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అదే సమయంలో చాలా సార్లు విమర్శలపాలు అయ్యాడు.

   సినిమా స్ఫూఫ్‌లతో యాంకర రవి రచ్చ

  సినిమా స్ఫూఫ్‌లతో యాంకర రవి రచ్చ

  'కామెడీ స్టార్స్' షోలో యాంకర్ రవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఇందులో అతడు ప్రతి వారం ఏదో ఒక సినిమా స్ఫూఫ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నాడు. ఇందులో తన పాత కో యాంకర్ లాస్య మంజునాథ్‌ను కూడా భాగం చేస్తున్నాడు. అతడు హీరోగా.. ఆమె హీరోయిన్‌గా కనిపిస్తూ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. తద్వారా షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంలో భాగం అవుతున్నాడు.

  హీరోగా మారిన రవి... లిప్ లాక్ కోరిక

  హీరోగా మారిన రవి... లిప్ లాక్ కోరిక

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో ముక్కు అవినాష్ స్కిట్‌ కోసం యాంకర్ రవి సినిమా హీరోగా మారాడు. అతడిపై ఓ మూవీ షూటింగ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో డైరెక్టర్ అయిన అవినాష్ దగ్గరకు వచ్చి 'హీరోయిన్‌తో ఒక లిప్ కిస్ సీన్ పెట్టండి' అని కోరతాడు. దీనికి అతడు ఓకే చెబుతాడు.

  ఆమెతో లిప్ కిస్ ప్లాన్ చేసిన డైరెక్టర్

  ఈ స్కిట్‌లో డైరెక్టర్ అయిన అవినాష్.. హీరోగా చేస్తోన్న యాంకర్ రవికి అదిరిపోయే సీన్లను పెడతాడు. ముందుగా హీరోయిన్ వర్షిణి సౌందరాజన్‌ను గట్టిగా హగ్ చేసుకుని కసిగా చూడమని చెబుతాడు. అది అతడు చేయడంలో విఫలం అవుతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య లిప్ కిస్ ఉంటుందని.. అది ఎలా చేయాలో కూడా చెబుతాడు. అప్పుడు యాంకర్ రవి దాన్ని ట్రై చేసేస్తాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఎవరైతే ఏంటి అయిపోయిందిగా అంటూ

  ఎవరైతే ఏంటి అయిపోయిందిగా అంటూ

  యాంకర్ రవి.. వర్షిణికి ముద్దు పెట్టడానికి ట్రై చేయగా.. అది వర్కౌట్ కాదు. దీంతో సీన్‌లోకి వచ్చిన డైరెక్టర్ ముక్కు అవినాష్ ఆ పనిని కానిచ్చేస్తాడు. ఆ తర్వాత రవి సీన్ చేయొద్దా అంటే 'ఎవరు చేస్తే ఏంటి.. అయిపోయిందిగా' అంటూ పంచ్ వేస్తాడు. దీనికి వర్షిణి కూడా 'హా.. అవును సీన్ అయిపోయిందిగా' అంటోంది. దీంతో రవికి షాక్ తగులుతుంది. ఇక, ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

  English summary
  Anchor Ravi Now Doing Comedy Stars with Varshini Sounderajan and Lasya. In Next Episode.. He Ask Lip Kiss to Director Mukku Avinash.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X