లాక్‌డౌన్‌లో 21 రోజులు కాజల్ అగర్వాల్ పక్కన ఉంటే.. లత్కోర్ అంటూ ప్రదీప్‌కు యాంకర్ రవి ఝలక్

కరోనా లాక్‌డౌన్ పిరియడ్‌లో సినీ, టెలివిజన్ స్టార్లు, హోస్టులు, యాక్టర్లు యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్‌లతో హడావిడి చేస్తున్నారు. నాగబాబు తర్వాత యాంకర్ రవి యమ జోష్‌తో జబర్దస్త్, అదిరింది యాక్టర్లు, హోస్ట్‌లతో వినోదాన్ని పంచుతున్నారు. ఇటీవల ప్రదీప్, యాంకర్ రవి లైవ్‌లో కలిసి చిలిపిగా, సరదాగా సాగింది. యాంకర్ రవి, ప్రదీప్ మధ్య ఇలా..

పిచ్చి పిచ్చి ప్రశ్నలతో

పిచ్చి పిచ్చి ప్రశ్నలతో

యాంకర్ రవి, ప్రదీప్ టీవీ షోలో గానీ, మరేదైనా కార్యక్రమంలో ఉంటే ఆ సరదా, జోష్ వేరేలా ఉంటుంది. ఇక లైవ్‌లో ఉంటే ఆ సంగతి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఎక్కువగా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో యాంకర్ రవిని ప్రదీప్ ఆటపట్టించాడు. ఇక సమయం దొరికితే ప్రదీప్‌ను కూడా చిలిపి ప్రశ్నలతో రవి ఆడుకొన్నారు.

టాస్క్ ఎందుకు చేయలేదు

టాస్క్ ఎందుకు చేయలేదు

తమ ప్రశ్నల్లో భాగంగా ప్రదీప్‌ను నీవు ఇంటిలో బీది రియల్ మ్యాన్ కోసం ఎందుకు ఎలాంటి టాస్క్ చేయలేదు అని యాంకర్ రవి ఓ ప్రశ్న వేశాడు. అందుకు సమాధానం ఇస్తూ... నా ఇంటిలో చిపిరి లేదు. ఎవరో నా చిపిరి కట్టను ఎత్తుకెళ్లాడు. ఇంకా ఏమి పనులు చేయడానికి కుదర్లేదు. చిపిరి కొనడానికి బయటకు వెళ్లడం కుదర్లట్లేదు అంటూ తిక్కగా ఎదురు ప్రశ్నలు వేశాడు. దాంతో విసుగుపుట్టి లత్కోర్ సమాధానాలు ఇవ్వకు అంటూ రవి ఇరిటేట్ అయ్యారు.

కాజల్‌తో 21 రోజుల క్వారంటైన్‌లో

కాజల్‌తో 21 రోజుల క్వారంటైన్‌లో

అలా ఒకరినొకరు ప్రశ్నలు వేసుకొనే ఓ పోటీలో భాగంగా 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే.. నీతో ఎవరిని వెంట ఉంచుకొంటావు అనే ప్రశ్నకు ఠక్కున సమాధానం ఇస్తూ.. కాజల్ అగర్వాల్‌ను నాతో పెట్టుకొంటానని ప్రదీప్ సమాధానం ఇచ్చాడు. అయితే కాజల్ కాదు.. ఆర్జీవి, పోసాని, నారాయణ మూర్తిలో ఎవరిని వెంట ఉంచుకొంటావని ఆప్లన్లు ఇస్తే.. ప్రదీప్ ఆర్జీవి అని సమాధానం ఇచ్చారు.

శ్రీముఖి, అనసూయ కంటే రష్మీ గౌతమ్ బెటర్

శ్రీముఖి, అనసూయ కంటే రష్మీ గౌతమ్ బెటర్

లాక్‌డౌన్ సమయంలో అనసూయ, రష్మి, శ్రీముఖిలో ఎవరు బాగా ఇంటి పనులు నేర్చుకొన్నారనే ప్రశ్నకు ప్రదీప్ జవాబిస్తూ.. అనసూయకు అన్ని పనులు వచ్చు. శ్రీముఖి పనులు వచ్చినా చేయదు. కానీ 21 రోజుల్లో రష్మీ గౌతమ్‌ బాగా పనులు నేర్చుకొన్నది అని చెప్పారు. దానికి రష్మికి వంటలు చేయడం వచ్చా అంటూ ఆశ్చర్యపోయారు.

Recommended Video

Udaya Bhanu Condolences To Her Adopted Sister
సుధీర్‌పై ప్రదీప్ సెటైర్

సుధీర్‌పై ప్రదీప్ సెటైర్

బత్తిరి సత్తి, హైపర్ ఆది, సుధీర్‌లో ఎవరికీ క్వారంటైన్‌ అనే పదానికి స్పెల్లింగ్‌ రాదు అని యాంకర్ రవి అడిగిన ప్రశ్నకు ప్రదీప్ సమాధానం ఇస్తూ.. సుధీర్‌కు రాదని ఠక్కున చెప్పాడు. సుధీర్‌కు టాలెంట్ నాకు తెలుసు. అందుకే తొందరగా సమాధానం చెప్పాను అని మరో ప్రశ్నకు ప్రదీప్ సమాధానం ఇచ్చారు. ఇలా వారిద్దరి మధ్య సరదాగా, చిలిపిగా ప్రశ్నలు, జవాబుల ప్రోగ్రాం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X