twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: యాంకర్ రవి కారుకు ప్రమాదం.. ఇలాంటి లం** వల్లే రేప్‌లు జరుగుతున్నాయంటూ ఫైర్

    By Manoj
    |

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత గుర్తింపు దక్కించుకున్న వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ యాంకరింగ్‌లో దూసుకుపోతున్న రవి.. తనదైన ముద్రను వేశాడు. అలాగే, కొన్ని సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. అదే సమయంలో భారీగా ఆర్జిస్తున్నాడు. తాజాగా రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే...

    ఆ షోతోనే బాగా గుర్తింపు వచ్చింది

    ఆ షోతోనే బాగా గుర్తింపు వచ్చింది

    బుల్లితెరపై వచ్చే ప్రొగ్రామ్‌లలో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంటాయి. అలాంటి వాటిలో ‘పటాస్' ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్‌కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అదే సమయంలో రవికి కూడా బాగా గుర్తింపు వచ్చింది.

    వివాదాలు చుట్టు ముట్టాయి

    వివాదాలు చుట్టు ముట్టాయి

    యాంకర్‌గా రవికి ఎంత మంచి పేరు వచ్చిందో.. అంత కంటే ఎక్కవగా అతడిని వివాదాలు చుట్టు ముట్టాయి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని, చివాట్లు తిని మళ్ళీ క్షమాపణలు కోరాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో జరిగిన సంఘటన అతడి కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయింది.

     ఆ షోను నుంచి వెళ్లిపోయాడు

    ఆ షోను నుంచి వెళ్లిపోయాడు

    ఇటీవల రవి తనకు ఎంతో పేరును తెచ్చి పెట్టిన ‘పటాస్' షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం సహ యాంకర్ శ్రీముఖి కూడా ‘పటాస్'కు టాటా చెప్పేసి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిపోయింది. తర్వాత వర్షిణితో కలిసి ఈ షోను హోస్ట్ చేశాడు రవి. కానీ, ఏమైందో ఏమో ఇటీవల ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకున్నాడు.

    రవి కారుకు ప్రమాదం

    శనివారం సాయంత్రం యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నగరంలోని మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వెళుతుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవి కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కానీ, ఎవరకీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    ఇలాంటి వాళ్ల వల్లే రేప్‌లు

    ఇలాంటి వాళ్ల వల్లే రేప్‌లు

    ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రతి విషయాన్ని వీడియో తీయించాడు రవి. వ్యాన్ డైవర్‌తో మాట్లాడడం, పోలీసులకు ఫోన్ చేయడం కూడా అందులో కనిపించాయి. తర్వాత రవి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘ఇలాంటి తాగుబోతు డ్రైవర్లే రెస్ట్ తీసుకోడానికి ఆపుతారు. ఆ సమయంలో ల** రేప్‌లు చేస్తున్నారు' అంటూ ఫైర్ అయ్యాడు.

    English summary
    Other than anchoring he also worked on too many TV shows, movies. Here is a movie in which Ravi is working in the lead role – Idi Maa Prema Katha. Its a drama and romance movie, people loved the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X