ఎనిమిదేళ్ల వివాహాబంధం.. భార్యతో బైకు మీద షికార్లు.. యాంకర్ రవి రచ్చ రచ్చే!!
యాంకర్ రవి పెళ్లి విషయం ఒకప్పుడు హాట్ టాపిక్. అసలు రవికి పెళ్లి అయిందా? లేదా? అనేది ఓ పెద్ద భేతాళ ప్రశ్నలాఎంతో మందిని తొలిచింది. పెళ్లైందని కొందరు అంటే.. పెళ్లే కాలేదు ఇంకా బ్యాచ్‌లరే అంటూ ఇంకొందరు కామెంట్లు చేసేవారు. ఎక్కడికి వెళ్లినా రవికి ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యేవి. ఎందుకంటే మనోడు లేడీ యాంకర్లతో నడిపే కెమిస్ట్రీ అలా ఉండేది మరి. యాంకర్ రవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అతనికి పెళ్లి కాలేదని అనుకునే వారు. కానీ యాంకర్ రవి ఓ రోజు అందరికీ షాక్ ఇచ్చాడు.

ఫ్యామిలీ ఫోటోతో క్లారిటీ..
యాంకర్ రవి తన పెళ్లి విషయంలో దోబూచాలాడు. నెటిజన్లు యాంకర్ రవిని పెళ్లి విషయం అడిగి అడిగి విసుగు పుట్టించారు. చివరకు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ.. నా పెళ్లి గురించి మీకు ఎందుకంటూ యాంకర్ రవి ఫైర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో యాంకర్ రవి తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి క్లారిటీ ఇచ్చాడు.

భార్య, పాపతో హ్యాపీ..
యాంకర్ రవికి పెళ్లి కావడమే కాదు.. ఓ చిన్న పాపు కూడా ఉందనే విషయాన్ని ఒక్క చిన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఒక్క ఫోటోతో ఎన్నో ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఎన్నో పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. తన భార్య నిత్య, పాప వియాను గురంచి చెబుతూ అసలు విషయాన్ని చెప్పాడు.

ప్రేమ పెళ్లి..
యాంకర్ రవి ఆ తరువాత తన ప్రేమ కథను కూడా చెప్పాడు. బీటెక్‌లో విచిత్రంగా మొదలైన ప్రేమ చివరకు పెళ్లి వరకు వచ్చిందని, ఇలా హ్యాపీగా ఉంటున్నామని చెప్పుకొచ్చాడు. ఇక తన పాప వియాతో రవికి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ తెరపై పండించిన ప్రేమకు అందరూ ఫిదా అయ్యారు.

ఎనిమిదేళ్ల వివాహాబంధం..
యాంకర్ రవి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అవుతున్నాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి అందులో రవి తన పర్సనల్ వీడియోలను కూడా పెడుతున్నాడు. భార్య, పాపతో కలిసి స్పెషల్ కాన్సెప్ట్‌లతో వీడియోలను షేర్ చేస్తుంటాడు. తమ ఎనిమిదేళ్ల వివాహాబంధం సందర్భంగా మరో వీడియోను షేర్ చేయబోతోన్నట్టు తెలిపాడు.
Recommended Video

స్పెషల్ వీడియో..
తమకు వివాహాం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నసందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశాడు. వెడ్డింగ్ స్పెషల్ టీజర్ అంటూ... బైక్ మీద షికార్లు చేస్తున్నాడు. భార్యను ఎక్కించుకుని హీరోలా రైడ్ చేస్తున్నాడు. ఇక పూర్తి వీడియోను రేపు విడుదల చేస్తానని తెలిపాడు. మొత్తానికి రవి తన యూట్యూబ్ చానెల్‌ను ఇలా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











