యాంకర్ రవికి తలనొప్పిగా మారిన షో.. ఆ విషయంలో భార్యతో విబేధాలు!
యాంకర్ రవికి బుల్లితెరపై ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ మాలో ఉదయాన్నే వచ్చే సమ్‌థింగ్ స్పెషల్ ప్రోగ్రాంలో యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన రవి.. వెండితెరపై హీరోగా ఎదిగాడు. ఈక్రమంలో రవి ఎంతో శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్డంను సంపాదించుకున్నాడు. ప్రదీప్, సుధీర్ వంటి వారు ఎంత పోటీ ఇస్తున్నా.. వారికి ధీటుగా నిలబడ్డాడు.

లేడీ ఫాలోయింగ్..
యాంకర్ రవికి ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎవరో ఒక లేడీ యాంకర్ పక్కన ఉండేది, వారితో కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యేది. అలా లాస్య, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ ఎంతో మంది రవి పక్కన పర్ఫెక్ట్ జోడీగా ఎన్నో షోల్లో అలరించారు. అందుకే రవికి ఎక్కువగా లేడీ ఫాలోయింగ్ ఉండేది.

అదో పెద్ద సస్పెన్స్..
యాంకర్ రవికి పెళ్లైందా? ఒకవేళ అయి ఉంటే ఆమె ఎవరు? ఎక్కడున్నారు? ఇలా సవాలక్ష ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. ఈ విషయాన్ని ఎంతోకాలంగా గుప్తంగా ఉంచుతూ వచ్చాడు. యాంకర్ రవి పెళ్లి మీద కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతూ ఉండేవి. చివరకు ఓ రోజు తన భార్య నిత్య సక్సేనా, పాప వియాను అందరికీ పరిచయం చేశాడు.

కొత్త షోలతో సందడి..
యాంకర్ రవి ప్రస్తుతం అదిరింది షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్‌గానే మరో కొత్త షోను ప్రారంభించాడు. నువ్వు రెడీ నేను రెడీ అంటూ భార్యభర్తలతో ఆటలు ఆడించడానికి సిద్దమయ్యాడు. ఈ షోలో యాంకర్ వింధ్య రవితో పాటు సందడి చేయనుంది. ఈ షో కారణంగానే రవి, నిత్యలకు బేదాభిప్రాయాలు వచ్చాయి.
Recommended Video

ఎప్పుడైనా భార్యలే గెలుస్తారు..
నువ్వు రెడీ నేను రెడీ షోపై రవి భార్య నిత్య కామెంట్స్ చేస్తూ... హలో హబ్బి..మీరు ఎంత ప్రయత్నించినా.. భార్యలే చివరకు గెలుస్తారు.. వింధ్య నేను నీతోనే ఉంటాను.. అని చెప్పుకొచ్చింది. ఇక దీనికి రవి స్పందిస్తూ. హాహాహా భర్తలే గొప్పవారు అంటూ ఓ నవ్వు నవ్వేశాడు. మరి వీరి ఇంట్లో ఎవరు గెలుస్తారో?. ఏది ఏమైనా ఈ షో మాత్రం భార్యభర్తల మధ్య ఉన్న ఈ సరదాను వెలికితీస్తోంది.


Click it and Unblock the Notifications











