twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటోల్లే హౌలేగాళ్లు.. వారికి దూరంగా ఉండాలన్న యాంకర్ రవి.. ఆమెను ఉద్దేశించే అన్నాడా?

    |

    బుల్లితెరపై యాంకర్‌గా తనదైన శైలిలో ఆకట్టుకుంటోన్న యాంకర్ రవి.. కామెడీ షోలతో అదరగొడుతున్నాడు. తన పక్కన ఉన్న యాంకర్స్ మారుతూ ఉంటారు కానీ అతను మాత్రం అలాగే ఉంటాడు.

    మొదట్లో లాస్య, రవి..

    మొదట్లో లాస్య, రవి..

    లాస్య, రవి అంటే ఎంతగా పాపులరో అందరికీ తెలుసు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన ఈ జంటపై అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే లాస్య పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మధ్యలో కొన్ని ప్రోగ్రామ్‌లు చేసినా అంతగా సక్సెస్ కాలేదు.

    పటాస్‌ షోతో ఫుల్ ఫేమస్ అయిన రవి, శ్రీముఖి

    పటాస్‌ షోతో ఫుల్ ఫేమస్ అయిన రవి, శ్రీముఖి

    యాంకర్‌గా తన పక్కన ఉండేవాళ్లు మారుతూ ఉన్నారు.. కానీ రవి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యూత్‌లో ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు. రవి, శ్రీముఖి కలిసి చేసిన పటాస్ షో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.

    ప్రస్తుతం రవి, వర్షిణి హవా..

    ప్రస్తుతం రవి, వర్షిణి హవా..

    శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో పటాస్ షోకు వర్షిణిని యాంకర్‌గా తీసుకున్నారు. రవి, వర్షిణి కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. గతంలోలాగే మళ్లీ పటాస్ షో విజయవంతంగా దూసుకుపోతోంది.

     ఫ్యామిలీని ప్రపంచానికి పరిచయం చేసిన రవి..

    ఫ్యామిలీని ప్రపంచానికి పరిచయం చేసిన రవి..

    రవికి పెళ్లయిందా? లేదా? అంటూ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దీంతో వాటన్నంటిని భరించలేక రవి.. తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశాడు. కాలేజ్‌లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, తనకు ఓ కూతురు కూడా ఉందని తెలిపాడు.

    తాజాగా చేసిన పోస్ట్ వైరల్..

    నా లైఫ్ ఫిలాసఫీ చాలా సింపుల్.. లో లివింగ్.. హై థింకింగ్.. కష్టపడాలే.. పేరు తెచ్చుకోవాలే.. డబ్బులు సంపాదించాలే.. ఫైనల్‌గా హౌలేగాళ్లను దూరం పెట్టాలే అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన నెటిజన్లు హౌలేగాళ్లంటే ఎవరని అడిగారు. నెగెటివ్ పీపుల్.. వాడి తప్పులు తెలుసుకోకుండా పక్క వాళ్ల తప్పులు లెక్కపెట్టేటోళ్లు అంటూ వివరించాడు.

    శ్రీముఖికి సపోర్ట్ చేయని రవి..

    శ్రీముఖికి సపోర్ట్ చేయని రవి..

    తాజాగా బిగ్‌బాస్ షో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారగా.. యాంకర్ రవి మాత్రం అలీ రెజాకు తన మద్దతు తెలపడం, వరుణ్, రాహుల్ బాగా ఆడుతున్నారంటూ చెప్పడం లాంటివి చూస్తే రవి, శ్రీముఖికి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా శ్రీముఖి తన బ్రేకప్ విషయాన్ని చెప్పడం.. ఆమె చెప్పింది రవి గురించా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా రవి పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    English summary
    Anchor Ravi Post Goes Viral. Naa life philosophy chaala simple “Low Living, High Thinking” Kashtapadaale, Peru techukovaale, Dabbu sampadhinchukovaale & final ga, howle gaallani dhooram pettaale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X