Bigg Boss 5 Teluguలో మరో ట్విస్ట్.. రవి రీ ఎంట్రీ ఉంటుంది కానీ, మరో లిటిగేషన్ కూడా!
బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ చివరికి వచ్చేయడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే సంగతి కంటే టాప్ 5లో ఎవరు ఉంటారు అనే దాని మీద చర్చ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన రవి గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అన్నీ వెరైటీగా
బిగ్ బాస్ సీజన్ 5లో ఏకంగా 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 19 మందితో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచి ఆసక్తిగా సాగుతూ వస్తోంది. అయితే ఇప్పటికే చాలా మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు .. అయితే గత సీజన్స్ లో సీక్రెట్ రూమ్ లో పెట్టి గేమ్ ఆడారు కానీ ఈ సారి కేవలం లోబో ఒక్కడినే కొన్నాళ్ల పాటు సీక్రెట్ రూమ్ లో ఉంచారు. గత సీజన్స్ లో ఉన్నట్టు ఈ సీజన్ లో ఒక్క వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా జరగలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన ఓ కంటెస్టెంట్ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు యాంకర్ రవి. రవి హౌస్ నుంచి బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఊహించని విధంగా రవి ఎలిమినేషన్ జరిగింది.

అభిమానులు నిరసన
ఓట్లు తక్కువ వచ్చాయి అని చెబుతూ రవిని ఎలిమినేట్ చేశారు కానీ అసలు మంచి ఫాల్యింగ్ ఉన్న రవికి కాజల్, ప్రియంకాల కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మకుండా రవి ఎలిమినేట్ అయిన వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రవి ఎలిమినేట్ అని ప్రకటించిన వెంటనే బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర రవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

రవి లో ఎలాంటి ఆందోళన కనిపించలేదు
కానీ ఇంత జరిగితే అసలు ఎలిమినేషన్ సమయంలో రవి లో ఎలాంటి ఆందోళన కనిపించలేదు.. మిగిలిన హౌస్ మేట్స్ షాక్ అయ్యారు కానీ రవి మాత్రం ఏ ఎమోషన్ లేకుండా చాలా కూల్ గా కనిపించాడు. ఇక ఇప్పుడు రవి రీఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగులో ఇలా బయటకు వెళ్లి రావడం కొత్తేమి కాదు గత సీజన్స్ లో ఇలా పలువురు బయటకు వెళ్లి తిరిగి హౌస్ లోకి వచ్చారు. సీజన్ 2 యాంకర్ శ్యామల, నూతనయుడు , అలీ రెజా లాంటి వారు రీ ఎంట్రీ ఇచ్చారు.

యాంకర్ రవి మళ్లీ షోలోకి
యాంకర్ రవి బిగ్ బాస్ తెలుగు 5 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత లో ప్రొఫైల్ కొనసాగిస్తున్నాడు. అయితే యాంకర్ రవి మళ్లీ షోలోకి ప్రవేశిస్తున్నాడని వస్తున్న వార్తలు నిజం కాదని అంటున్నారు. మరో మూడు వారాల్లో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, ఈ తరుణంలో రవి రీ-ఎంట్రీ లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తమకు అదనపు తల నొప్పిగా మారుతుందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు.

ఆ రిస్క్ తీసుకోకుండా
బిగ్ బాస్ మేకర్స్ రవిని కానీ మరే ఇతర కంటెస్టెంట్‌ని తీసుకువస్తే వారు షోను పొడిగించవలసి ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు 5 ముగింపు తేదీ ఇప్పటికే నిర్ణయించినందున షో నిర్వాహకులు ఇకపై షోను పొడిగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫైనల్స్ దగ్గర పడుతున్న కారణంగా ఇప్పుడు టిఆర్‌పి రేటింగ్స్ కూడా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ స్లాట్‌లో ఓంకార్ కొత్త షోను నింపాలని స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి యాంకర్ రవి రీ-ఎంట్రీ అసాధ్యం. అయితే రవి అభిమానులకు ఒక శుభవార్త ఏమిటంటే, యాంకర్ రవి తన మాజీ హౌస్‌మేట్స్‌ను ఉత్సాహపరిచేందుకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం తిరిగి హౌస్‌కి రావచ్చు.


Click it and Unblock the Notifications











