ఆ ఘటనతో ఇండస్ట్రీ వదిలేద్దామనుకొన్నా..అమ్మా, చెల్లీ కూడా టార్చర్ పడ్డారు: యాంకర్ రవి

"రారండోయ్ వేడుక చూద్దాం" ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ వివాదం పై యాంకర్ రవి మళ్ళీ ఇలా వివరణ ఇచ్చాడు.

Recommended Video

ఆ ఘటనతో ఇండస్ట్రీ వదిలేద్దామనుకొన్నా -యాంకర్ రవి

"రారండోయ్ వేడుక చూద్దాం" ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడంపై వివాదం చెల రేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనకు ఏ పాపం తెలియదని..... అపుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని, ఆయన అంత నీచమైన కామెంట్స్ చేసారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి వాపోయాడు.

ravi anchor

అయితే అసలు నాకు వినిపించలేదూ అన్న మాటలని ఎవ్వరూ నమ్మక పోగా విపరీతంగా ట్రోల్ చేసారు. అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆ విశయాన్ని గుర్తు చేసుకున్నాడు యాంకర్ రవి. ఆలీ హోస్ట్ గా సాగే ఒక షోలో పాల్గొన్న రవి తన పాత సంగతుల గురించి చెబుతూ.. ఆనాటి అనుభవాన్ని కూడా ఇలా చెప్పుకొచ్చాడు..

చలపతిరావు మాటలు వినపడలేదు

చలపతిరావు మాటలు వినపడలేదు

"చలపతిరావు అన్న మాటలు నాకు వినపడలేదు. ఏదో మాటల్లో పడి ఫ్లోలో 'సూపర్' అనాల్సి వచ్చింది. అదే విషయాన్ని మా డాడీకి చెప్పినా నమ్మలేదు. ప్రేక్షకుల వైపు నుంచి ఆలోచిస్తే ఆ మాటను నేను కూడా నమ్మను. పరిస్థితి అలాంటిది. ఆ సందర్భంలో అనిపించింది.. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోదామా అని.

మా డాడీకి ఆఫీస్‌లో టార్చర్

మా డాడీకి ఆఫీస్‌లో టార్చర్

ఎందుకంటే.. మా డాడీకి ఆఫీస్‌లో టార్చర్. మీ అబ్బాయి ఏంటండీ ఇలా?.. చుట్టుపక్కల వాళ్లతో మా అమ్మకు టార్చర్. మీ కొడుకు ఇలా అన్నాడా అని. మా చెల్లికి కూడా ఆఫీస్‌లో తలెత్తుకోలేని పరిస్థితి. అందరికీ నా వల్ల ఇంత ప్రాబ్లం అయింది..

 ఇంటికొస్తే చాలు అదే డిస్కషన్

ఇంటికొస్తే చాలు అదే డిస్కషన్

ఈ ప్రొఫెషన్ అవసరమా? అని అనిపించింది. ఇంటికొస్తే చాలు ఇదే డిస్కషన్.. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఇదే డిస్కషన్. కజిన్స్ కొంతమంది నమ్మారు. ఇక ఇండస్ట్రీలో నమ్మింది అంటే శ్రీముఖి, సుమగారు, ప్రదీప్.

శ్రీముఖి సపోర్ట్ మర్చిపోలేనిది

శ్రీముఖి సపోర్ట్ మర్చిపోలేనిది

ఇలాంటి సిట్యుయేషన్‌ను మేము కూడా ఫేస్ చేశాం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎవరూ నమ్మరు అంటూ ఈ ముగ్గురి దగ్గర నుంచి నాకొచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆ రోజు శ్రీముఖి ఇచ్చిన భరోసా.. సుమగారు ఫోన్ చేసి ఇచ్చిన ఆ స్ట్రెన్త్ నన్ను ఇక్కడ ఉండేలా చేశాయి.'' అంటూ ఆ చేదు అనుభవాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు రవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X