ఆయన మరణంతో షాక్.. అందుకే కరోనా వచ్చినా చెప్పలేదు.. యాంకర్ రవి ఎమోషనల్

కరోనా సెకండ్ వేవ్ లో లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మొదలు తాజాగా ఎన్టీఆర్ దాకా అందరినీ చుట్టేస్తుంది. బుల్లితెర మీద కూడా కరోనా తన పంజా విసిరింది.. ఇప్పటికే కరోనా కారణంగా యాంకర్ ప్రదీప్ తన తండ్రిని కోల్పోవలసి వచ్చింది.. అదే సమయంలో యాంకర్ రవి కూడా కరోనా బారిన పడ్డారు.. తాజాగా కరోనా నుంచి కోలుకున్న యాంకర్ రవి తన కరోనా క్వారంటైన్ గురించి పలు కీలక అంశాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

కరోనా నుంచి కోలుకున్న రవి

కరోనా నుంచి కోలుకున్న రవి

కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా యాంకర్ రవి చేరారు. ఇక తనకు కరోనా సోకడంతో గురించి ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకు కరోనా సోకిన సమయంలో తన కుటుంబం తనకు ఎలా అండగా నిలబడింది, తాను ఈ 14 రోజులకు క్వారెంటైన్ టైం ఎలా గడిపాను అనే విషయాలు రవి పంచుకున్నారు.

అందుకే చెప్పలేదు

అందుకే చెప్పలేదు

ఇప్పటికే కరోనా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనకు కరోనా సోకింది అని చెప్పి సోషల్ మీడియా మరింత చర్చ జరగడానికి కారణం కాకూడదని తాను తనకు కరోనా సోకిన విషయం అనౌన్స్ చేయలేదు అని యాంకర్ రవి పేర్కొన్నారు. అలాగే తనను కలిసిన వాళ్ళందరికీ పర్సనల్ గా ఫోన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోమని మాత్రం చెప్పాను అని చెప్పుకొచ్చారు.

ముందు భయపడ్డా

ముందు భయపడ్డా

ఇక తనకు కరోనా సోకిన తెలిసిన వెంటనే ముందు కాస్త భయపడ్డానని, కానీ 14 రోజుల ఐసోలేషన్ తర్వాత తాను అనవసరంగా భయపడ్డాను అనే విషయం అర్థం అయింది అని రవి చెప్పుకొచ్చారు. సేఫ్టీ ప్రోటోకాల్ గనుక పాటిస్తే ఈ కరోనా బారి నుంచి బయటపడవచ్చని , ఎప్పటికప్పుడు బలమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ల సలహాలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని తెలుసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

అది చాలా పెద్ద షాక్

అది చాలా పెద్ద షాక్

ఇక తాను ఐసోలేషన్ లో ఉండగా సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉన్నానని ఎలాంటి నెగిటివ్ స్టఫ్ కూడా దరి చేరనివ్వకుండా తాను వాటిని ఎవాయిడ్ చేశానని చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయం స్నేహితులతో మాట్లాడుతూ గడిపాను అని ఆయన అన్నారు. ఇదే సమయంలో యాంకర్ ప్రదీప్ తండ్రి చనిపోవడం నిజంగా షాక్ కలిగించే అంశమని రవి పేర్కొన్నారు. తాము అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మరణంతో కాస్త షాక్ అయ్యానని తన భార్య నిత్య ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ అండగా నిలబడింది అని చెప్పుకొచ్చారు.

భయంకరమైన ఆలోచనలు

భయంకరమైన ఆలోచనలు

ఇక రాత్రులు నిద్ర పట్టేది కాదని, భయంకరమైన ఆలోచనలు చుట్టుముడుతూనే ఉండేవని రవి పేర్కొన్నారు. కానీ నిత్య ఎప్పటికప్పుడు పాజిటివ్ ఆలోచనలు రేకెత్తిస్తూ ఈ క్వారంటైన్ పీరియడ్ మొత్తం ఒక కన్నకొడుకును చూసుకున్నట్టు చూసుకుందని చెప్పుకొచ్చారు. అయితే పాపను నిత్య వాళ్ళ అంకుల్ ఇంటికి పంపించామని చెప్పుకొచ్చారు.

అదే పెద్ద నరకం

అదే పెద్ద నరకం

అయితే ఈ క్వారంటైన్ పీరియడ్ మొత్తం మీద పాపను కలవకుండా ఉండడమే పెద్ద నరకం అని పేర్కొన్నారు. పాపను చాలా మిస్ అయ్యానని పేర్కొన్న రవి ఎంత వీడియో కాల్స్ తో టచ్ లో ఉన్నా సరే నేరుగా కలవలేక పోతున్నా అనే బాధ చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పుకొచ్చారు. ఇక గత ఏడాది నిత్య కరోనా బారిన పడటంతో అప్పుడు తీసుకున్న జాగ్రత్తలన్నీ తన విషయంలో కూడా తీసుకుని త్వరగా కోలుకునేలా చేసింది అని రవి చెప్పుకొచ్చారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X