Anchor Ravi: "లహరి షరితో నా రిలేషన్ అదే.. ఆ 15 రోజులు నరకం చూశా"
మొదటి నుంచి తెలుగులో మేల్ యాంకర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిని ఇట్టే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వాళ్లలో ముందుడేది ప్రదీప్ అయితే ఆ తర్వాత పేరు రవిదే అవుతుంది. అద్భుతమైన అందం, అంతకు మించిన స్పాంటేనియస్ తో ఫుల్ కామెడీ చేసే యాంకర్ రవి.. బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఓ షోకు వచ్చిన ఈయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఉండగా.. లహరి షెరితో తన రిలేషన్ గురించి చెప్పాడు. హౌస్ లో ఉండగానే కాదు.. బయటకు వచ్చాక కూడా తామిద్దరి మధ్య రిలేషన్ గురించి తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రవికి... ముందు నుంచి సినిమాలు అంటే ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తోనే ఆయన సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా త్వరగా ఓ పెద్ద హీరో అయిపోవాలని అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా కొరియాగ్రాఫర్ గా సినీ రంగంలో అడుగు పెట్టాలనుకుని వచ్చిన ఈయన ఎంతో తిరగ్గా ముందు పని నేర్చుకోమని హీరో నాగార్జున చెప్పారట. దాన్ని బాగా అర్థం చేసుకున్న రవి మాటీవీలో యాంకర్ గా మారిపోయాడు రవి.

ముఖ్యంగా సమ్ థింగ్ స్పెషల్ అనే షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. అయితే అందులో ఒక్కడే కాకుండా.. యాంకర్ లాస్య కాంబోలో ఈ షో చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఈ జోడీకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత బిగ్ బాస్ కు కూడా వెళ్లారు. అక్కడే మోడల్ లహరి షెరితో చాలా స్నేహంగా ఉన్నారు. అర్థరాత్రుళ్ల వరకు వారిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం.. చాలా క్లోజ్ గా ఉండడం చేశారు. అయితే సినీ నటి శైలజ ప్రియ వీరి బంధంపై హౌస్ లో ఉండగానే కామెంట్లు చేసింది. ప్రతీ ఒక్కరి బర్త్ డేకు ఏదో ఒక్ సర్ ప్రైజ్ రాగా.. రవి బర్త్ డేకు ఏదీ రాలేదట.
దీంతో రవి చాలా ఫీల్ అవుతుండగా.. ఆమె వచ్చి మీ ఇద్దరినీ ఇలా చూసి నిత్య ఏమైనా ఫీల్ అయ్యుండొచ్చని చెప్పిందట. అయితే అప్పుడేదో కోపంలో తాను అన్న మాటను శైలజ ప్రియ నామినేషన్లలో తీసి లహరి షెరితో, తన రిలేషన్ గురించి గట్టిగా మాట్లాడగా.. అవి చాలా హైలెట్ అయ్యాయని చెప్పాడు రవి. కానీ తామిద్దరూ మంచి స్నేహితులం అని అందుకే బయటకు వచ్చాక కూడా తాము చాలా క్లోజ్ గా ఉన్నామని వివరించాడు. ముఖ్యంగా హౌస్ లో ఉన్నప్పుడు చాలా డిప్రెషన్ కి లోనయ్యానని... చెప్పాడు.

ముఖ్యంగా లహరి షెరితో, తన రిలేషన్ చూసి నిత్య ఏమైనా ఫీల్ అయిందోమోనని చాలా భయపడ్డానని.. ఆ డిప్రెషన్ లోనే తన కూతురు మొహాన్ని కూడా మర్చిపోయినట్లు వివరించారు. ఇలా అక్కడ చాలా నరకం చూశానని.. బిగ్ బాస్ చూసి ఎవరి జీవితాన్ని కూడా జడ్జ్ చేయకూడదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవి చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











