Anchor Ravi: "పెళ్లయ్యాక కూడా కాలేదని చెప్పడానికి కారణం అదే.. నా కూతుర్ని కూడా మర్చిపోయా"
యాంకర్ రవి.. ఈ పేరు తెలియని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా లేరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన యాంకరింగ్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో ఉన్న అతి తక్కువ మంది మేల్ యాంకర్లలో ఈయన ఒకరు. అయితే బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తున్న ఈయనకు పెళ్లి అయి ఓ పాపు కూడా ఉంది. కానీ ఈయన మాత్రం పాప పుట్టాక కూడా చాలా రోజుల పాటు తనకు పెళ్లి కాలేదని సింగిల్ అనే చెప్పుకొచ్చాడు. అయితే ఆయన భార్యను తెరమీదకు తెచ్చి అందరికీ చూపించినా.. అన్ని రోజులు ఎందుకు ఆ విషయం దాచాడనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ తొలిసారి ఈ కుర్ర యాంకర్ అసలు విషయం చెప్పాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన యాంకర్ రవి.. బీటెక్ చేశాడు. ఆ తర్వాత తాను సినిమాల్లోకి రావాలని అలా అయితే భవిష్యత్తు బాగుంటుందని భావించాడు. ముందుగా కొరియాగ్రాఫర్ గా సినీ రంగంలో అడుగు పెట్టాలనుకుని వచ్చిన ఈయన ఎంతో తిరగ్గా.. చాలా మంది దీనికంటే నువ్వు యాంకరింగ్ చేయడం బెటర్ అని చెప్పారట. ముఖ్యంగా హీరో నాగార్జున ఆ మాట చెప్పడంతో.. మాటీవీలో యాంకర్ గా మారిపోయాడు రవి. సమ్ థింగ్ స్పెషల్ అనే షో చేశాడు. అయితే అందులో ఒక్కడే కాకుండా.. యాంకర్ లాస్య కాంబోలో ఈ షో చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాళ్లు కూడా అదే నిజం అన్నట్లుగా ప్రవర్తించేవాళ్లు. కానీ సడెన్ గా ఓరోజు యాంకర్ లాస్య పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కానీ రవి మాత్రం చాలా రోజుల పాటు తాను సింగిలే అని చెప్పుకొని తిరిగాడు. అందరూ మీ పెళ్లి ఎప్పుడు, ఇంకెప్పుడు చేసుకుంటారని అడిగినా.. వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది అంటూ దాటవేసేవాడు. కానీ సడెన్ గా ఓరోజు ఈయన తన భార్యతో పాటు కూతురిని కూడా ఓ షో స్టేజీ మీదకు తీసుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
రవికి పెళ్లి అయి ఓ పాప కూడా ఉందన్న విషయం తెలుసుకున్న చాలా మంది తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. అయితే పెళ్లై, పాప కూడా ఉన్న యాంకర్ రవి ఆ విషయాన్ని అన్ని రోజుల పాటు ఎందుకు దాచారు అన్నదానిపై మాత్రం ఆయన ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈయన రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ అనే షోకు వచ్చాడు. అక్కడే ఈ విషయంపై తొలిసారి క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి అయ్యాక ఆయన భార్యను నిత్యను తీసుకుని ఎక్కడికైనా వెళ్తే.. ఈయన మా భర్త అంటూ నిత్య పరిచయం చేసేదట. అప్పుడు వాళ్లంతా ఈయన వేరే వాళ్లతో కనిపిస్తారు ఆమె భర్త కదా.. నువ్విలా చెబుతున్నావేంటంటూ చాలా ఇబ్బంది పెట్టారట.

ఇదంతా చూసిన తనకు ఈ విషయం గురించి బయట చెప్పాలని అనిపించలేదట. తమ గురించి తమకు బాగా తెలుసు కాబట్టి బయటి వాళ్లతో సంబంధం లేదనుకుని రివీల్ చేయలేదని వివరించాడు. కానీ ఆ తర్వాత రివీల్ చేశానని.. ఒక షో ద్వారా చెప్పడం వల్ల అందరికీ నిత్యనే తన భార్య అని వియా తన కూతురు అన్ని విషయం అర్థం అయిందని చెప్పుకొచ్చాడు. అలాగే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మొదటి 15 రోజుల్లోనే కూతురిని మర్చిపోయానని.. కళ్లు మూసుకుని తల్చుకుంటే కూతురు మొహం కూడా తనకు గుర్తురాలేదని ఆనాటి రోజులను చెప్పాడు. పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఈ షో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











