నువ్వొస్తానంటే వద్దంటానా అంటూ లాస్యకు టెండర్.. కౌగిలింతలతో ముంచెత్తి.. యాంకర్ రవి ఘాటుగా రొమాన్స్

కరోనా కాలంలో ఓ రకమైన దిగ్బ్రాంతికి గురైన ప్రేక్షకులకు బుల్లితెర వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నది. పలు ఛానెల్స్ కామెడీ ప్రధానమైన షోలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. అలాంటి కోవలో వస్తున్న టెలివిజన్ షో కామెడీ స్టార్స్. ఈ షోలో శేఖర్ మాస్టర్, వర్షిణి హోస్ట్‌గా యాంకర్లు లాస్య, రవి జోడి రొమాంటిక్‌తో కూడిన వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. తాజా ఎపిసోడ్‌కు చెందిన టీజర్‌ ఎలా ఉందంటే..

త్రిష మూవీకి పేరడిగా

త్రిష మూవీకి పేరడిగా

సిద్దార్థ్, త్రిష నటించిన నువ్వొస్తానంటే వద్దంటానా మూవీ పేరడిగా కామెడీ స్కిట్‌ను డిజైన్ చేశారు. లవర్స్‌గా లాస్య, రవిలు యాక్ట్ చేశారు. మా ఊర్లో పండించేది వరి.. నా పేరు సిరి అంటూ ఫన్ ఎక్స్‌ప్రెషన్‌తో లాస్య ఎంట్రీ ఇచ్చింది. అన్నయ్యగా పటాస్ కమెడియన్ తనదైన హాస్యాన్ని పండించారు.

ఆ పోకిరివి నీవేనా అంటూ

ఆ పోకిరివి నీవేనా అంటూ

నువ్వొస్తానంటే వద్దంటానా మూవీలో మాదిరిగా యాంకర్ లాస్య గుర్రపు బొమ్మను పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే.. మెల్లగా పరుగెత్తుకొంటూ వచ్చిన యాంకర్ రవి గట్టిగా వాటేసేకొని నలిపేసినంత పని చేశాడు. యాంకర్ రవిని వదలించుకొని లండన్ నుంచి వచ్చిన పోకిరివి నీవేనా అంటూ లాస్య అడిగింది.

సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ

సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ

అయితే తాను ఇష్టంగా ప్రేమించిన ప్రియుడిని సంతోష్ అంటూ లాస్య పిలువగానే.. మళ్లీ పరుగెత్తుకొంటూ వచ్చి కౌగిలించుకొనేందుకు ప్రయత్నించగా.. లాస్య దూరంగా జరిగింది. నిన్ను చూస్తే సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ లాస్యను కౌగిలించుకోవడానికి యాంకర్ రవి ప్రయత్నించగా.. సమ్‌థింగ్ సమ్‌థింగ్ కాదు.. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ లాస్య తన ప్రేమను ఒలకబోసింది.

పులిహోరలా ఉన్నాడంటూ...

పులిహోరలా ఉన్నాడంటూ...


ఇక లాస్యతో యాంకర్ రవి రొమాన్స్ చేస్తూ ఆమె అన్నయ్య కంటపడ్డాడు. దాంతో ఎవరు నువ్వు.. సెప్టిక్ ట్యాంక్‌లా ఉన్నావు అని గట్టిగా నిలదీశారు. దాంతో నేను సిటీలో ప్రేమించింది ఈయనే.. సంతోష్ అంటూ లాస్య తన అన్నయ్యకు చెప్పింది. దాంతో సంతోష్ అంటే మెడలో పులిగోరులా ఉంటారనుకొంటే... కంచెంలో పులిహోరలా ఉన్నాడు.. వీడినా నీవు ప్రేమించిందంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
 క్రేజీగా లాస్య, రవి జంట

క్రేజీగా లాస్య, రవి జంట

గతంలో బుల్లితెర మీద లాస్య, రవి జంటకు మంచి క్రేజ్ ఉండేది. అయితే పెళ్లి చేసుకోని లాస్య టెలివిజన్‌ రంగానికి దూరమైంది. ఇటీవలే మళ్లీ బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా.. వరుసగా ఆఫర్లను చేజిక్కించుకొని బుల్లితెరపై అద్భుతంగా రాణిస్తున్నారు. పటాస్‌కు దూరమైన యాంకర్ రవితో కలిసి జంటగా లాస్య జోరును కొనసాగిస్తున్నది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X