twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రవి ఫ్యామిలీలో కరోనావైరస్.. ఇంట్లో టెన్షన్ టెన్షన్

    |

    తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కరోనా పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారుతున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు టెన్షన్‌లో ఉంటున్నారు. ప్రజలంతా ఎప్పుడు, ఎక్కడ ఏమౌతుందనే భయంతో కనిపిస్తున్నారు. కరోనాను దూరంగా ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం గమనార్హం. అయితే తాజాగా యాంకర్ రవి తన ఇంట్లో కరోనా పాజిటివ్ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఫేస్‌బుక్ లైవ్‌లో యాంకర రవి మాట్లాడుతూ..

    జబర్దస్త్ వర్సెస్ అదిరింది

    జబర్దస్త్ వర్సెస్ అదిరింది

    జబర్దస్త్‌కు పోటీగా జీ తెలుగు టెలివిజన్‌లో ప్రారంభించిన అదిరింది టెలివిజన్ కామెడీ షో షూటింగును ప్రారంభించినట్టు యాంకర్ రవి తెలిపారు. షూటింగ్ స్పాట్ నుంచి ఫేస్‌బుక్ లైవ్‌ను మొదలుపెట్టి యాక్టర్లు, ఫెర్ఫార్లను ప్రేక్షకులకు, నెటిజన్లకు పరిచయం చేశారు. సెట్లో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నామని తెలిపారు.

    లాక్ డౌన్ తర్వాత షూటింగులో

    లాక్ డౌన్ తర్వాత షూటింగులో

    లాక్ డౌన తర్వాత అంతా గందరగోళంగా మారింది. గతంతో షూటింగ్‌ చేసే విధానానికి భిన్నంగా ఇప్పుడు షూట్ జరుగుతున్నది. కరోనా కారణంగా షూటింగ్ వాతావరణమంతా మారిపోయింది. ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకొని జాగ్రత్త తీసుకొంటున్నారు. షూటింగ్ లోకేషన్లలో పెద్ద పెద్ద శానిటైజర్ మెషిన్లను ఏర్పాటు చేశారు. టేక్ చెప్పినప్పుడే యాక్టర్లు మాస్కులు తీస్తున్నారు అని యాంకర్ రవి వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ

    దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లండి. లేకపోతే ఇంట్లోనే ఉండండి. మీ అందరూ బాగుండాలని కోరుకొంటున్నాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఆరోగ్యం చేజారితే కష్టంగా ఉంటుంది అని యాంకర్ రవి జాగ్రత్తలు చెప్పారు.

    మా ఫ్యామిలీలో కరోనావైరస్ పాజిటివ్

    మా ఫ్యామిలీలో కరోనావైరస్ పాజిటివ్

    తాజాగా మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరికి కరోనావైరస్ సోకింది. మా కజిన్ కరోనా బారిన పడ్డారు. లాక్‌డౌన్ తర్వాత అతడిని కలువలేదు. లాక్‌డౌన్‌కు ముందు కలిశాను. ఎవరైనా సరే కరోనా బారిన పడ్డారంటే ధ్యైర్యాన్ని కోల్పోవద్దు. ఫైట్ చేస్తూ ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకొండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని యాంకర్ రవి సలహాలు ఇచ్చారు.

    ఇక కరోనాతో సహజీవనమే..

    ఇక కరోనాతో సహజీవనమే..

    ప్రస్తుతం కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా రాకుండా చూసుకోవాలి. ఒకవేళ కరోనా బారిన పడితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మెడిసిన్స్ వస్తున్నాయి. కరోనా గురించి బెంగ పడొద్దు. నాన్‌వెజ్ తక్కువగా తినండి. భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. దాంతో ఇమ్యునిటీ పెరుగుతుంది అని యాంకర్ రవి పేర్కొన్నారు.

    Recommended Video

    Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
    2020 సంవత్సరం చేదు అనుభవాలతో

    2020 సంవత్సరం చేదు అనుభవాలతో

    2020 సంవత్సరం చాలా దారుణంగా ఉంది. ఈ సంవత్సరాన్ని ఏమనాలో తెలియడం లేదు. చాలామంది సినీ ప్రముఖులు చనిపోయారు. వైజాగ్‌లో గ్యాస్ దుర్గటన చాలా బాధించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా విషాద సంఘటనలు జరిగడం నాకు చాలా బాధకలిగింది. 2020 త్వరగా ముగస్తే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది అని యాంకర్ రవి అభిప్రాయపడ్డారు.

    English summary
    Anchor Ravi started his shoot at Adirindi show which is hosted with Anchor bhanu Sri. Nagababu and Navadeep are judges for the adirindi. Ravi reveals that his cousin tested coronavirus positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X