టాలీవుడ్‌కు కాబోయే మరో మెగాస్టార్ అతడే.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..
Anchor Ravi: యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక సంపాదించుకున్నారు. సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ల మజాకా, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి ప్రోగ్రామ్స్ ను వెయ్యికి పైగా ఎపిసోడ్‌లు చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. అటు సినిమాలతో పాటు, ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రవి.. టాలీవుడ్ కు కాబోయే మరో మెగాస్టార్ అతడే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరు?
యాంకర్ రవి తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. తాను నటించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చిన రవి.. షో మొత్తాన్ని తనదైన కామెడీ టైమింగ్, సరదా వ్యాఖ్యలతో ఆసక్తికరంగా మార్చేశారు. అయితే ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ షోలో భాగంగా రవి, స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. 'విజయ్ దేవరకొండ నిజంగా బంగారు కొండ. నా విషయంలో ఆయన ఎంతో సపోర్టుగా నిలిచారు. ఏదైనా అడిగితే కాదనకుండా ముందుకు వస్తారు.కానీ నేను ప్రతి విషయానికీ సహాయం అడగను'అని తెలిపారు. అంతేకాదు... 'నేను ఆయన ప్రతి సినిమా చూసి రివ్యూ చెబుతాను. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన హార్డ్ వర్క్ మాత్రం మారదు. ఆయన రియల్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏమాత్రం ఫరక్ పడదు. ఎందుకంటే ఆయనకు తన స్ట్రెంత్ ఏంటో, వీక్నెస్ ఏంటో పూర్తిగా తెలుసు. ఓ మార్గాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తాడు' అంటూ ప్రశంసలు కురిపించారు.
యాంకర్ వర్షా 'ఆయనకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?' అని అడగగా... రవి భావోద్వేగంగా స్పందించారు. 'విజయ్ దేవరకొండ ఈజ్ మై బంగారు దేవరకొండ. ఆయన కోసం నేను ప్రతిసారి దేవుడిని ప్రార్థిస్తుంటాను. మరిన్ని విజయాలు అందుకోవాలి. అంచెలంచెలుగా ఎదిగి చిరంజీవిలాగా మెగాస్టార్ స్థాయికి చేరాలి. సూపర్ స్టార్ అవ్వాలి. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది' అని అన్నారు. విజయ్‌లో అందగాడు, ఫిట్‌నెస్, గ్రేట్ బాడీ లాంగ్వేజ్, మంచి యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయని... 'టైమ్ కలిసి వస్తే ఆయన టాలీవుడ్‌కు మరో మెగాస్టార్ అవుతారు' అని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన ప్రశ్నగా వర్షా 'మీరు లక్‌ను నమ్ముతారా? టాలెంట్‌ను నమ్ముతారా?'అని అడిగారు. దీనికి రవి స్పష్టంగా స్పందిస్తూ... 'కచ్చితంగా టాలెంట్‌ను నమ్ముతాను. కానీ మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. అయితే ప్రతి విషయంలో అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోవద్దు. అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఉన్నవాడికి అదృష్టం ఆటోమేటిక్‌గా కలిసి వస్తుంది' అన్నారు.
ఈ సందర్భంగా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఉదాహరణగా చెప్పారు. 'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఆయన ఆ అర్హత సంపాదించుకున్నాడు. హార్డ్ వర్క్ నమ్ముకున్నాడు. చరిత్రలో హార్డ్ వర్క్ ఓడిపోయిన సందర్భం లేదు... ఉండదు కూడా,' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండపై ఆయన చూపించిన అభిమాన భావం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే 'టాలెంట్ వర్సెస్ లక్'పై చెప్పిన మాటలు కూడా యువతలో చర్చకు దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











