భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య.. స్టేజ్‌పైనే నాటీ అంటూ షాకింగ్ కామెంట్స్.!

యాంకర్ రవి.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి.. వెండితెర పైనా మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఇక, తాజాగా రవి గురించి అతడి భార్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పటాస్ షోతో ప్రత్యేక గుర్తింపు

పటాస్ షోతో ప్రత్యేక గుర్తింపు

బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్‌లలో ‘పటాస్' ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్‌కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో పాపులర్ అవ్వడానికి రవి కూడా మెయిన్ రీజన్ అంటారు. ఇందులో రవి చేసే సందడి అంతా ఇంతా ఉండదు. అందుకే అతడికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

వివాదాలు కూడా చుట్టుముట్టాయి

యాంకర్ రవికి ఎంత మంచి పేరు వచ్చిందో.. అంత కంటే ఎక్కువ స్థాయిలోనే వివాదాలూ చుట్టుముట్టాయి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని, చివాట్లు తిని మళ్ళీ క్షమాపణలు కోరాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో జరిగిన సంఘటన అతడి కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయింది. ఇలా చాలా వివాదాల కారణంగానూ రవి హాట్ టాపిక్ అయ్యాడు.

ఫ్యామిలీ గురించి బయటపెట్టాడు

ఫ్యామిలీ గురించి బయటపెట్టాడు

అసలు రవికి పెళ్లైందా లేదా అన్న చర్చ జరుగుతున్న సమయంలో అతడే స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రవి తన పోస్ట్‌లో ‘సక్సెస్‌ఫుల్ మ్యాన్ కంటే ఫ్యామిలీ మ్యాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య నిత్య, నా మూడేళ్ల కూతురు వియా' అంటూ ముగ్గురు చర్చి నుంచి బయటకు వస్తున్న ఫోటోను బయటపెట్టాడు. తన ఫ్యామిలినీ అందరికి పరిచయం చేయగా.. అప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు

ప్రతీ పండగకు బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రోజా, నాగబాబు గొడవ పడడాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. వీరిలో ఏ టీమ్ వాళ్లు గెలిస్తే వాళ్లే తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. ఇలా గతంలోనూ పలు కార్యక్రమాలు వచ్చాయి.

భర్త గురించి రహస్యం బయటపెట్టేసింది

భర్త గురించి రహస్యం బయటపెట్టేసింది

‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' ప్రోగ్రాంకు రవి తన ఫ్యామిలీతో సహా వచ్చాడు. ఈ సందర్భంగా రవి భార్య నిత్య మాట్లాడింది. ‘బీటెక్ చదివే రోజుల్లో రవి ఎంతో నాటీగా ఉండేవాడు. స్టేజ్ పైన కూడా అలాగే కనిపిస్తాడు. కానీ మెచ్యూరిటీ లేదు' అని చెప్పింది. దీనికి సమాధానంగా రవి ‘నాది చైల్డ్ మ్యారేజ్. అమాయకుడిని చేసి పెళ్లి చేశారు' అని వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ముద్దులు పెట్టుకోవడంతో పాటు డ్యాన్స్ చేశారు. ఇక, ఈ షోకు రవి పాప స్పెషల్ అట్రాక్షన్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X