For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  BiggBoss5కి స్టార్ యాంకర్.. లైవ్ లో నోరు జారిన మరో యాంకర్, భలే కవర్ చేశారుగా!

  |

  తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు బిగ్ బాస్ షో బాగా దగ్గర అయిందని చెప్పవచ్చు. అందుకే తెలుగులో అయితే ఇప్పటికే నాలుగు సీజన్ల షో పూర్తికాగా 5వ సీజన్ కి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అదే ఈ షోలో వాళ్లు వెళుతున్నారు అంటూ ముందు నుంచి పెద్ద లిస్ట్ పెట్టి ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా ఈ లిస్టులో ఉన్న ఒక స్టార్ యాంకర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు నోరు జారిన కో యాంకర్ ఆ తర్వాత నాలిక్కరుచుకుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  అంతా సిద్దం

  అంతా సిద్దం

  తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మరికొద్ది రోజుల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ ల పేర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతానికైతే కంటెస్టెంట్ లు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా దీనికి సంబంధించి కొందరు ఫైనల్ కూడా అయ్యారు అని అంటున్నారు. తాజాగా వెల్లడవుతున్న సమాచారం మేరకు దాదాపు 16 మంది కంటెస్టెంట్ లు ఈసారి కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. 3,4 సీజన్స్ నాగార్జున హౌస్ట్ చేయగా ఈ అయిదవ సీజన్ కూడా ఆయన హోస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది నిజానికి ఆయనకు ప్రస్తుతం వరుస సినిమాలు రెడీగా ఉన్నాయి అయినా బిగ్ బాస్ ను ఆయన వదులుకోకుండా బిగ్ బాస్ కి కూడా డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

   సెట్ నిర్మాణం కూడా

  సెట్ నిర్మాణం కూడా

  ఇప్పటికే సెట్ నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. అన్నపూర్ణ 7 ఎకర్స్ లోని సువిశాల ప్రాంగణంలో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సెట్ నిర్మాణ పనులు పూర్తి చేయబోతున్నారని అంటున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కొద్దిరోజులుగా యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ విషయం మీద రవి గానీ బిగ్ బాస్ వాళ్లు గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.. కానీ నిన్న సునీల్ హీరోగా నటించిన కనబడుటలేదు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ రవి యాంకర్ లాస్య ఇద్దరు హోస్ట్ చేశారు.. అందులో భాగంగానే లాస్య సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ కనబడుటలేదు అనేది టైటిల్ కాబట్టి మరి కొద్ది రోజుల్లో యాంకర్ రవి కూడా కనబడకపోవచ్చు అంటూ పేర్కొంది.

   వికటించిన కవరింగ్

  వికటించిన కవరింగ్

  రవికి అర్థం కాక కనబడకపోవడం ఏమిటి అని ప్రశ్నించగా అదే ఏదో హౌస్ లోకి వెళ్తున్నావట కదా అనేసి నాలిక కరుచుకుంది. ఈవిడ ఏంట్రా బాబు ఇలా లీక్ చేసింది అని షాక్ తిన్న రవి వెంటనే ఏం హౌస్ అని ప్రశ్నించగా అదే మీ హౌస్, మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు అంట కదా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ కవరింగ్ అనేది ప్రేక్షకులు అందరికి ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి యాంకర్ లాస్య కూడా బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఎంటర్ అయి కొన్ని రోజుల పాటు హౌస్ లో కొనసాగి మంచి పేరు తెచ్చుకుంది. ఒక రకంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక యాంకర్ రవి లాస్య మధ్య పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ స్నేహితులుగా మారారు. ఇప్పుడు అనూహ్యంగా లాస్య రవి సీక్రెట్ బయట పెట్టి మళ్లీ చిక్కుల్లో పడేసిందని చెప్పక తప్పదు.

  నిబంధనలు ఒప్పుకోవు

  నిబంధనలు ఒప్పుకోవు

  నిజానికి బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరు కూడా తాము బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళుతున్నామని చెప్పడానికి నిబంధనలు ఒప్పుకోవు. అలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక ముందే లీక్ చేస్తే బిగ్ బాస్ నిర్వాహకులకు కంటెస్టెంట్ లు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అందుకే దాదాపు ఎవరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్లు తమ సన్నిహితులకు సైతం వెల్లడించరు. మరి యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పోతున్న విషయం లాస్య లీక్ చేయడంతో రవి నీ హౌస్ లోకి తీసుకుంటారా లేదా అనేది కూడా అనుమానాస్పదమనే చెప్పాలి.

  Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
  ఒప్పుకుంటారా?

  ఒప్పుకుంటారా?

  అయితే లాస్య ఒకవేళ ప్రచారం జరుగుతున్న లిస్ట్ మేరకు రవి పేరు మెన్షన్ చేసిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే యాంకర్ రవి ప్రస్తుతం చేతినిండా షోలతో బిజీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి షో ల మీద వచ్చే ఆదాయం వదులుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం అనే అంశం కాస్త అనుమానాస్పదంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ హౌస్ లోకి వెళ్లి వచ్చాక మా టీవీ కి తప్ప మరే టీవీ కి కొన్నాళ్ళపాటు యాంకరింగ్ చేయకూడదు అనే నిబంధన ఉంటుంది. మర్రి ఇన్ని నిబంధనల మధ్య ఆయన హౌస్ లోపలికి వెళ్ళి రావడానికి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాలి మరి.

  English summary
  The names of the contestants in Bigg Boss Season Five are also being advertised on a large scale. It is known that the name of anchor Ravi is also heard in this list. This is reinforced by some recent comments made by Anchor Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X