నా మనిషి అనుకున్నా .. 50 వేల కోసం, తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్
తెలుగులో యాంకర్లు అనగానే వెంటనే సుమ కనకాల, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనసూయ, రష్మి, శ్రీముఖి, శ్యామల వెంటనే గుర్తొస్తారు. వీరంతా ఏళ్లుగా తెలుగు బుల్లితెరను దున్నేస్తున్నారు. యాంకరింగ్ అంటేనే ఫిమేల్ డామినేషన్. పైగా అనసూయ, రష్మి వంటి వారి రాకతో అందాల ఆరబోత ఒక ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్‌లా మారింది. ఇలాంటి చోట అబ్బాయిలు అడుగుపెట్టగలరా? ఒకవేళ వచ్చిన సక్సెస్ కొట్టగలారా? అనే అనుమానాలు సహజం.
అయితే ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ వంటి వారు ఈ అనుమానాలను పటాపంచలు చేస్తున్నారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా యాంకరింగ్‌లో కింగ్‌లేనని వీరు నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు రవి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈయన బీటెక్ పూర్తి చేశారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో గట్టిగానే ట్రై చేశాడు. కానీ ఎక్కడా అవకాశం దక్కలేదు. కొరియోగ్రఫీ వైపు కూడా ఓ చూపు చూసిన రవిని కింగ్ అక్కినేని నాగార్జున ఇచ్చిన సలహా యాంకరింగ్ వైపు నడిపించింది.

వెంటనే మాటీవీలో యాంకర్ అవతారం ఎత్తారు. తొలుత సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో తెలుగు వారిని పలకరించారు. ముఖ్యంగా యాంకర్ లాస్య జోడీగా చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ జోడీకి, ఈ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు.. రవి, లాస్య ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా గాసిప్స్ వౌరల్ అయ్యాయి. ఇలాంటి దశలో యాంకర్ లాస్య సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు.
కానీ రవి మాత్రం చాలా కాలం పాటు బ్యాచిలర్‌గా తిరిగారు. దీంతో కనిపించిన వాళ్లంతా నీ పెళ్లెప్పుడు, ఎప్పుడు చేసుకుంటారని అడగటంతో తప్పించుకుని తిరిగేవాడు. కానీ ఓ రోజున సడెన్‌గా తన భార్యతో పాటు కూతురిని కూడా ఓ స్టేజ్ మీదకి తీసుకొచ్చి షాకిచ్చాడు. యాంకర్‌గా తెలుగునాట ఉన్న పాపులారిటీతో బిగ్‌బాస్‌లో పాల్గొనాల్సిందిగా ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిని తిరస్కరిస్తూ వచ్చిన రవి.. చివరికి బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని అనుకున్నప్పటికీ.. అనుకోని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు.
ఇదిలాఉండగా.. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి గతంలో తాను అసిస్టెంట్ చేతిలో మోసపోయినట్లుగా చెప్పాడు. ఇండస్ట్రీలో అసిస్టెంట్‌లను నమ్మాల్సిన పరిస్ధితి ఉంటుందని.. ఇంటి నుంచి బయల్దేరినప్పుడు కాస్ట్యూమ్స్, నా బ్యాగ్, నా కారు కీ, నా రూమ్ కీస్ అన్ని అతని వద్దే ఉంటాయని తెలిపాడు. ఓ రోజున నా అసిస్టెంట్ రాలేదని.. దీంతో లక్ష్మణ్ అని ఓ అబ్బాయిని రమ్మని చెప్పానని వివరించాడు. పెట్రోల్ బంక్ దగ్గర డ్రైవర్‌కి కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పేవాడినని.. ఈ పిన్ నెంబర్‌ను లక్ష్మణ్ నోట్ చేసుకున్నాడని అన్నాడు.
నా పర్స్ ఎప్పుడూ నా కారులోనే ఉంటుందని, రెండు ఏటీఎం కార్డ్స్ కొట్టేశాడని.. ఓ రోజు ఉదయం రూ. 50 వేలు డబ్బులు కట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో తాను కంగారు పడ్డానని రవి తెలిపాడు. డ్రైవర్‌ని అడగ్గా.. తనకేం తెలియదు అన్నాడని.. నేనే నేరుగా బ్యాంక్‌కి వెళ్లి అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లో లక్ష్మణ్ కనిపించాడని.. కొట్టేసిన డబ్బుతో వాడు విజయనగరం పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు నిమిషాల్లో దొరుకుతాడని.. కానీ వాడి జీవితం నాశనం చేయడం ఇష్టం లేక వదిలేశానని యాంకర్ రవి తెలిపాడు.


Click it and Unblock the Notifications











