ప్రదీప్ లవ్‌ ట్రాక్‌పై యాంకర్ రవి కామెంట్స్: ఆమెను బాగా ట్రై చేస్తున్నాడని మొత్తం లీక్ చేశాడు.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు హవా చూపిస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి... చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. టాలెంట్ పరంగా, ఆఫర్ల పరంగా, రెమ్యూనరేషన్ పరంగా అందరినీ వెనక్కి నెట్టేసి స్టార్ యాంకర్‌ అయిపోయిన అతడు కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రదీప్.. పలువురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో యాంకర్ రవి తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

అప్పుడే సత్తా చాటిన ప్రదీప్... అవార్డులు

అప్పుడే సత్తా చాటిన ప్రదీప్... అవార్డులు

కెరీర్ ఆరంభంలో రేడియో జాకీగా పని చేశాడు ప్రదీప్. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన ‘గడసరి అత్త సొగసరి కోడలు' షోతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ షో ద్వారా ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు.

ఆ ఘనత సాధించిన ఏకైక యాంకర్ ప్రదీపే

ఆ ఘనత సాధించిన ఏకైక యాంకర్ ప్రదీపే

జీ తెలుగు ఛానెల్‌లోనే ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను' అనే షోను ప్రారంభించాడు ప్రదీప్. అతడే స్వయంగా రూపొందించుకున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు వచ్చారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ ప్రోగ్రామ్‌కు వచ్చాడు. అలాగే, బాలీవుడ్, కోలీవుడ్ హీరోలూ ఎంట్రీ ఇచ్చారు. ఇలా అందరినీ తీసుకొచ్చిన యాంకర్‌గా ప్రదీప్ నిలిచాడు.

షోలలో ఒకటి వివాదాస్పదం.. అది ప్రత్యేకం

షోలలో ఒకటి వివాదాస్పదం.. అది ప్రత్యేకం

యాంకర్ ప్రదీప్... తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో షోలలో పని చేశాడు. వాటిలో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అందులో డ్యాన్స్ షో ‘ఢీ' ఒకటి. ఇది ప్రదీప్‌లోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అందుకే ఈ షోను ప్రత్యేకంగా చూస్తాడీ యాంకర్. మరోవైపు ‘పెళ్లి చూపులు' అనే షో అతడికి చెడ్డ పేరును, ఎన్నో వివాదాలను తీసుకొచ్చింది.

పలువురితో ప్రేమాయణం... అలా వార్తల్లోకి

పలువురితో ప్రేమాయణం... అలా వార్తల్లోకి

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ప్రదీప్.. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతడిపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రదీప్ పలువురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇవి కాక.. కొన్ని సంఘటన కారణంగా ఈ టాప్ యాంకర్ తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

 ప్రదీప్ లవ్‌ ట్రాక్‌పై యాంకర్ రవి కామెంట్స్

ప్రదీప్ లవ్‌ ట్రాక్‌పై యాంకర్ రవి కామెంట్స్

ప్రస్తుతం ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న షోలలో ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' ఒకటి. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఈ షోలో... రెండు వారాల క్రితం అతడు సింగర్ హారిక ట్రాక్ నడిపినట్లు చేసి హైలైట్ అయ్యాడు. సదరు సింగర్‌ను ఉద్దేశిస్తూ ‘బిజీగా ఉండి మిమ్మల్ని చూడలేదు' అంటూ అతడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా దీనిపై యాంకర్ రవి స్పందించాడు.

ఆమెను బాగా ట్రై చేస్తున్నాడని లీక్ చేశాడు

ఆమెను బాగా ట్రై చేస్తున్నాడని లీక్ చేశాడు

జీ తెలుగులో ‘ జీ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ 2020' అనే కొత్త కార్యక్రమం రాబోతుంది. ఇందులో సింగర్ హారిక కూడా పాల్గొన్నారు. ఆమెను ఉద్దేశిస్తూ యాంకర్ రవి ‘ప్రదీప్ గాడు ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. నేను రమ్మనగానే వచ్చి డ్యాన్స్ చేసింది' అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమెను ప్రదీప్ నిజంగానే ప్రేమిస్తున్నాడన్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
ప్రదీప్ పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవరంటే

ప్రదీప్ పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవరంటే

ఈ మధ్య ప్రదీప్ పెళ్లిపై ఓ న్యూస్ ఇండస్ట్రీలో జోరుగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అతడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తెనే అతడు వివాహమాడబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X