రష్మీ సుధీర్ పెళ్లిపై యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్.. కార్యం జరిపిస్తా అనగానే సిగ్గు పడిన బ్యూటీ.!
ఆకట్టుకునే అందంతో తెలుగు బుల్లితెరపై తనదైన మార్క్‌తో దూసుకుపోతోంది యాంకర్ రష్మీ గౌతమ్. వరుసగా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. టెలివిజన్ రంగంలోనే కాక.. వెండితెరపైనా తళుక్కున మెరుస్తోంది. అందం.. టాలెంట్.. ఇవన్నీ పక్కన పెడితే... రష్మీ గౌతమ్ తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీని సంపాదించుకోవడం వెనుక సుడిగాలి సుధీర్ పాత్ర ఉంది. అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తల వల్లే ఆమె బాగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రవి వీళ్లిద్దరి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

రష్మీ సుధీర్... జబర్ధస్త్ షో కలిపింది
బుల్లితెరపై దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతూ తన హవా చూపిస్తోంది ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్. ఈ షో ద్వారానే యాంకర్‌గా రష్మీ గౌతమ్... కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఈ షో కారణంగానే వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అదే సమయంలో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారమూ ప్రారంభం అయింది.

యూట్యూబ్ జోడీ.... చాలా ఫేమస్
రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్‌ను బుల్లితెరపై చాలా మంది ఓ ఆట ఆడుకుంటున్నారు. తరచూ వీళ్లిద్దరిపై ఏదో ఒక పంచ్ పేలుస్తూ ఏడిపిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలోనైతే వీళ్లిద్దరిపై వచ్చినన్ని వీడియోలు మరెవరిపై వచ్చి ఉండవు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ జంటపై ఎన్నో వీడియోలు క్రియేట్ అయ్యాయి. అందుకే వీళ్లను యూట్యూబ్ జోడీ అని అంటుంటారు.

క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారుగా
బుల్లితెరపై తమ తమ రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. ఫేమ్ ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలని వీళ్లిద్దరూ భావిస్తుంటే... ఈ జంట క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరిపై ఏదో రకమైన స్కిట్టో, రొమాంటిక్ డ్యాన్సో క్రియేట్ చేసి భారీ స్పందనను అందుకుంటున్నారు.

లేదు లేదు అంటూనే చేస్తున్నారు
చాలా కాలంగా తమపై వస్తున్న పుకార్లను పలుమార్లు ఖండించారు రష్మీ సుధీర్. అయినప్పటికీ వీళ్లిద్దరిపై వార్తలు మాత్రం ఆగడం లేదు. దీని వెనుక ఈ ఇద్దరూ చేస్తున్న పనులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. షోల కోసం మేకర్లు క్రియేట్ చేస్తున్న టాస్క్‌లను చేస్తుండడంతో వీళ్ల మధ్య ఎటువంటి రిలేషన్ ఉందన్న విషయం బయటి వాళ్లకు అర్థం కావడం లేదు.

రష్మీ పెళ్లిపై యాంకర్ రవి కామెంట్స్
ఒకవైపు రష్మీ సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుండగా... ఇదంతా ఉత్తదే అని వాళ్లిద్దరూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ రవి చేసిన కామెంట్స్ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కు గెస్ట్‌గా వచ్చిన అతడు రష్మీతో సుధీర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ కామెంట్లు చేశాడు. దీంతో ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఓకే అంటే నేనే దగ్గరుండి జరిపిస్తాను
రాకింగ్ రాకేష్ స్కిట్‌లో భాగంగా దువ్వాడ జగన్నాథమ్ గెటప్ వేసిన యాంకర్ రవి... రష్మీ గౌతమ్ దగ్గరకు వెళ్లి ‘ఏవమ్మా అరవై ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటావా. షష్టిపూర్తి సమయంలో శుభకార్యమంటే బాగోదు. ఏంటి ప్రాబ్లం వాడు ఒప్పుకోవడం లేదా. కాదు కాదు నువ్వే ఒప్పుకోవట్లేదంట కదా. ఒప్పేసుకోరాదు ఆ శుభకార్యమేదో నేనే జరిపిస్తా' అంటూ కామెంట్లు చేశాడు.
Recommended Video
సిగ్గు పడ్డావంటే శుభకార్యం దగ్గరైంది
యాంకర్ రవి చేసిన కామెంట్లతో రష్మీ గౌతమ్ తెగ సిగ్గు పడిపోయింది. దీంతో ‘సిగ్గు పడుతున్నావంటే శుభాకార్యం చాలా దగ్గరలోనే ఉంది' అంటూ అతడు మరో డైలాగ్ విసిరాడు. ఇలా రవి, రష్మీ మధ్య జరిగిన సంభాషణ వచ్చే వారం ఎపిసోడ్‌లో హైలైట్ అవనుందని అర్థం అవుతోంది. ఈ కారణంగానే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోమోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











